GHMC Expansion: హైదరాబాద్ మహానగరం రూపురేఖలు మారిపోబోతున్నాయ్! 

త్వరలో హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించనుంది. హైదరాబాద్ మ్యాప్ మారిపోబోతోంది. జీహెచ్ఎంసీలో 7 మున్సిపల్ కార్పొరేషన్స్, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయితీల విలీనానికి చురుగ్గా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. మొత్తం 2,053 చదరపు కిలోమీటర్ల పరిధికి జీహెచ్ఎంసీ విస్తరించనుంది. 

New Update
GHMC Expansion: హైదరాబాద్ మహానగరం రూపురేఖలు మారిపోబోతున్నాయ్! 

GHMC Expansion: హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా రూపుదిద్దుకోబోతోంది. ఔటర్ రిగ్ రోడ్డు వరకూ ఉన్న ప్రాంతాలన్నీ కలిపి జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఇప్పటికే దీనికోసం కసరత్తులు పూర్తయ్యాయి. నగరం శివార్లలో ఉన్న మున్సిపల్ 7 కార్పొరేషన్స్ జీహెచ్ఎంసి పరిధిలోకి రానున్నాయి. బండ్లగూడ, బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్‌, నిజాంపేట్‌ మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసి పరిధిలోకి తీసుకువచ్చే ఏర్పాట్లు సాగుతున్నాయి. అలాగే 20 మున్సిపాలిటీలు , 33 గ్రామ పంచాయతీలు కూడా జీహెచ్ఎంసి పలో విలీనం కాబోతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు జనవరి 26, 2025 వరకూ ఎన్నికైన బాడీలకు సమయం ఉంది. అదేవిధంగా జీహెచ్ఎంసీకి ఫిబ్రవరి 10, 2026 వరకూ సమయం ఉంది. మున్సిపాలిటీలకు ఈ గ్యాప్ కు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ పాలన్ తీసుకురావచ్చు. జీహెచ్ఎంసి బాడీ కాల పరిమితి ముగిసిన తరువాత వీటిని విలీనం చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

GHMC Expansion: ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పరిధిలోకి 33 గ్రామాలను తీసుకురావడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలు రెడీ చేశాయి. మొత్తం 2,053 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా ఉంటుంది. దీనిలో విలీనం చేయబోయే గ్రామ పంచాయితీలు 33 ఉన్నాయి. వీటి విస్తీర్ణం 386.28 చదరపు కిలోమీటర్లు. ఈ పంచాయితీలలో 1,72,836 జనాభా ఉంది. 

publive-image

విలీనం కానున్న గ్రామాలివే..
GHMC Expansion: మెదక్ జిల్లాలో రామచంద్రాపురం, ఐలాపూర్, కిష్టారెడ్డిపేట్, ముత్తంగి, పోచారం, సుల్తాన్ పూర్, పాటి గ్రామాలు,  రంగారెడ్డి జిల్లాలోని కంచివాని సింగారం, కొర్రెముల, ఫిర్జాదిగూడ, ప్రతాపసింగారం, బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతిపేట, చీర్యాల్, గోదుమకుంట రాంపల్లి, , తిమ్మాయిపల్లి ప్రతిపాదనల్లో ద్గర్‌పల్లి, మంఖాల్, గౌడవెల్లి, పూడూరు, మంచిరేవుల, బొమ్రాస్‌పేట్, గోల్కొండ కలాన్, గోల్కొండ ఖుర్దు, హమీదుల్లానగర్, గోల్కొండ-కే, గోల్కొండ-డి, జన్వాడ గ్రామాలు జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనలు చేశారు.

Also Read : వయనాడ్‌ బాధితులకు అల్లు అర్జున్ సాయం.. రూ. 25 లక్షల విరాళం

Advertisment
తాజా కథనాలు