జగన్ చేసిన ఘనకార్యాలు ఇవే..గంటా శ్రీనివాసరావు సంచలన పోస్ట్.!

‘ఏపీ హేట్స్ జగన్’ అని రాష్ట్ర ప్రజలు ఎందుకు అంటున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఫొటో సరిపోతుందంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశారు టీడీపీ గంటా శ్రీనివాసరావు. ఈ నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో మీరు చేసిన ఘనకార్యాలు ఇవేనని పేర్కొన్నారు.

New Update
TDP Ganta: భీమిలి లోకల్ మేనిఫెస్టో రిలీజ్.. కూటమి లక్ష్యం ఇదే..!

Ganta Srinivasa Rao: టీడీపీ గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు. " ఏపీ హేట్స్‌ జగన్‌" అంటూ ఎక్స్ లో పొస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో వై ఏపీ హేట్స్ జగన్ అనడానికి రీజన్స్ ఏంటని తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

వైసీపీ సర్కార్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ఏపీ హేట్స్ జగన్’ అని రాష్ట్ర ప్రజలు ఎందుకు అంటున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఫొటో సరిపోతుందంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశారు. ఈ నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో మీరు చేసిన ఘనకార్యాలు ఇవేనని పేర్కొన్నారు.

Also Read: చంద్రబాబుకు ఊరట లభించేనా? బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ..!

ఆ ఫొటోలో ప్రజా వేదిక విధ్వంసం, రాజధాని లేకపోవడం, రుషికొండపై తవ్వకాలు, పెట్రోల్ బాదుడు, మూడు రాజధానులు, మైనింగ్, గంజాయి, తరలిపోయిన పరిశ్రమలు, కరెంటు కోతలు అంటూ పలు విషయాలను ప్రస్తావించారు. ‘వద్దు వద్దు జగన్.. మళ్లీ మాకొద్దీ జగన్’ అని ఎందుకు అంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా జగన్ గారూ? అని కామెంట్ చేశారు.

#ganta-srinivasa-rao
Advertisment
తాజా కథనాలు