Google pay : అగ్రరాజ్యంలో గూగుల్ పే బంద్..మరి మన సంగతేంటి ? మన డబ్బు సేఫేనా?

గూగుల్ పే సేవలను అమెరికాలో నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. కారణాలను వివరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. భారత్ లో గూగుల్ పే యూజర్ల సంగతి ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతోంది. గూగుల్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? మన డబ్బు భద్రమేనా? ఈ స్టోరీ చదవండి.

Google pay : అగ్రరాజ్యంలో గూగుల్ పే బంద్..మరి మన సంగతేంటి ? మన డబ్బు సేఫేనా?
New Update

Google pay :  ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పేకు మంచి ఆదరణ ఉంది. వినియోగదారులు ఈయాప్ ను సులభంగా వినియోగించే విధంగా రకరకాల ఫీచర్లు అందిస్తోంది. ప్రస్తుతం గూగుల్ పే 180 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. అయితే ఈ సంస్థ ఇప్పుడు అమెరికాలో తన సేవలను నిలిపివేసేందుకు సిద్ధమైంది. 2024 జూన్ 4వ తేదీ నుంచి అగ్రరాజ్యంలో సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనకున్నకారణాలు ఏంటి. భారత్ సహా ఇతర దేశాల్లో ఈ గూగుల్ పే సేవలు ఉపయోగించుకునే వినియోగదారుల సంగతేంటీ. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇదే కారణం:
అమెరికా గూగుల్ సేవలను నిలిపివేయడానికి ఆ సంస్థకు చెందిన గూగుల్ వాలెటే కారణం. ఈ వాలెట్ ను అమెరికా వాసులు ఉపయోగిస్తుంటారు. ఈయాప్ ద్వారా పేమెంట్ కార్డులుయాడ్ చేసుకోవచ్చు. షాపింగ్ చేస్తున్నప్పుడు ట్యాప్ అండ్ పే పద్ధతిలో ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు. అంతేకాదు ట్రన్సిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, వంటి ఐడీకార్డులతో సహాఇతర డిజిటల్ డాక్యుమెంట్లను ఈ గూగుల్ వాలెట్ లో పొందుపరుచుకోవచ్చు. ఇక ఈ వాలెట్ అమెరికా మార్కెట్లో గూగుల్ పే కన్నాఐదు రెట్లు ప్రజాదరణ పొందింది. గూగుల్ లో ఉన్న ఫీచర్లన్నీ కూడా వాలెట్ లో ఉన్నాయి. ఈ కారణంతోనే గూగుల్ పేను అమెరికాలో నిలిపిస్తున్నట్లు ప్రకటించింది. సేవలను పూర్తిగా నిలిపివేసేవరకు యూజర్లు గూగుల్ పే ను అలాగే వినియోగించుకోవచ్చని తెలిపింది.

2024 జూన్ 4 వరకు యూజర్లు వారి గూగుల్ పే బ్యాలన్స్ ను చూసుకోవచ్చని బ్యాంక్ కు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని తెలిపింది. ఇవే సర్వీసులను గడువు తర్వాత గూగుల్ పే వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని పేర్కొంది. 2024 జూన్ 4 నాటికి అమెరికా వెర్షన్ గూగుల్ పే యాప్ లో యూజర్ల డబ్బులను సెండ్ అండ్ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకోలేరని తెలిపింది. దీంతోపాటు పలు డీల్స్ ను యాక్టివేట్ చేసుకోలేరని వెల్లడించింది.

మరి మన దేశంలో గూగుల్ పే సంగతేంటి అనే డౌట్ మీలో రావచ్చు. భారత్, సింగపూర్ లో ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొంది. ఈ దేశాల్లో గూగుల్ పే ఉపయోగించే లక్షలాది మంది యూజర్ల కోసం ఆయా దేశాల ప్రత్యేక అవసరాల కోసం యాప్ ను మరింత డెవలప్ చేస్తామని తెలిపింది.

ఇది కూడా చదవండి: ఏపీ టెట్‌ హాల్‌టికెట్స్ రిలీజ్.. డౌన్ లోడ్ లింక్ ఇదే!

#g-pay-app-exit-united-states #google-pay-ban-in-america-g-pay-app-exit-us-market #google-pay-india #zee-pay-services-suspended-in-america
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe