అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో జరిగిన ఘోర ప్రమాదంలో చనిపోయిన వారి సమాఖ్య 17కు చేరుకుంది . ఇంకా చాలా మంది మృత్యువుతో ఆసుపత్రిలో పోరాడుతున్నారు. రియాక్టర్ పేలడంతో మొదటి అంతస్తు స్లాబ్ కూలిపోయింది. దీంతో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది . ఇదిలా ఉంటే.. ప్రమాదం జరిగిన ఎస్సైన్షియా కంపెనీ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయింది. తెలంగాణలోని సర్వే నెం.542/02, ప్లాట్ నెం:DS /14,IKP నాలెడ్జ్ పార్క్, కొల్తూర్ విలేజ్, షమీర్‌పేట్, రంగారెడ్డి - 500078 ఎడ్రస్ తో రిజిస్టర్ అయింది. ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయిన ఈ కంపెనీకి 5 గురు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నట్టు రిజిస్ట్రేషన్ వివరాలలో పేర్కొన్నారు. రిజిస్టర్ కంపెనీల సమాచారాన్ని అందించే టాఫ్లర్(Tofler ) బ్లాగ్ ప్రకారం Escientia అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (CIN) U24100TG2013PTC085962.
ఇంకా ఈ కంపెనీకి సంబంధించి ఇంటర్ నెట్ లో టాఫ్లర్ బ్లాగ్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. దీని అధీకృత వాటా మూలధనం INR 22.00 కోట్లు మొత్తం చెల్లించిన మూలధనం INR 21.49 కోట్లు. కంపెనీ ప్రస్తుత బోర్డులో ఎక్కువ కాలం పనిచేసిన డైరెక్టర్లు యాదగిరి ఆర్ పెండ్రి అలాగే పెండ్రి కిరణ్ రెడ్డి 27 ఫిబ్రవరి, 2013న నియమితులయ్యారు. వారు 11 సంవత్సరాలకు పైగా బోర్డులో ఉన్నారు. ఇటీవల నియమించిన డైరెక్టర్లు వివేక్ వసంత్ సేవ్, అజిత్ అలెగ్జాండర్ జార్జ్, వీరు జూన్ 24, 2023న నియమితులయినట్లు కంపెనీల రిజిస్ట్రేషన్ వివరాల్లో పేర్కొన్నారు. ఇక ఈ డైరెక్టర్లలో యాదగిరి ఆర్ పెండ్రి మొత్తం 4 కంపెనీలలో సీటుతో అత్యధిక సంఖ్యలో ఇతర డైరెక్టర్‌షిప్‌లను కలిగి ఉన్నారు. మొత్తంగా, కంపెనీ దాని డైరెక్టర్ల ద్వారా మరో 7 కంపెనీలకు కనెక్ట్ అయి ఉంది.
ఇక కంపెనీ రిజిస్ట్రార్ కి ప్రతీ సంవత్సరం కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఎస్సెన్షియల్ అడ్వాన్స్ డ్ సైన్సెస్ ప్రయివేట్ లిమిటెడ్ ఆర్ధిక వివరాలు చివరిసారిగా 2023లో సమర్పించినట్టు టాఫ్లర్ బ్లాగ్ ప్రకారం తెలుస్తోంది. ఈ సంవత్సరం అంటే 2023-24కు సంబంధించి ఆదాయ వివరాలు కంపెనీ ఇప్పటికీ ప్రకటించలేదు. 2023 ఆర్థిక వివరాల ప్రకారం 31 మార్చి, 2023తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి Escientia అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఆపరేటింగ్ ఆదాయాల పరిధి INR 100 cr - 500 cr. ఇది EBITDA గత సంవత్సరం కంటే -22.67 % తగ్గింది. అదే సమయంలో, దీని బుక్ నెట్‌వర్త్ 24.86% పెరిగింది.
మొత్తమ్మీద చూసుకుంటే కనుక ఎస్సెన్షియల్ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను కూడా ప్రభుత్వానికి సమయానికి సబ్మిట్ చేయడం లేదని అర్థం అవుతోంది. పెద్ద ఎత్తున వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఫ్యాక్టరీలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల ఈ కంపెనీలో 70% వాటా వేరే కంపెనీకి విక్రయించారని తెలుస్తోంది. దీని విషయంలో వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.