35-ChinnaKathaKaadu: ‘సయ్యారే సయ్యా'... 35 – చిన్న కథ కాదు ఫస్ట్ సింగిల్

టాలీవుడ్ నటుడు ప్రియదర్శి , నివేతా థామస్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ '35 – చిన్న కథ కాదు'. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘సయ్యారే సయ్యా..’ అంటూ సాగే ఈ స్నేహ గీతం చిన్ననాటి జ్ఞాపకాలు, స్నేహితులను గుర్తుచేసేలా ఉంది.

New Update
35-ChinnaKathaKaadu: ‘సయ్యారే సయ్యా'... 35 – చిన్న కథ కాదు ఫస్ట్ సింగిల్

35-ChinnaKathaKaadu: ప్రియదర్శి, నివేతా థామస్, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రలో రాబోతున్న లేటెస్ట్ మూవీ '35 – చిన్న కథ కాదు'. ప్రియదర్శి ఓ లెక్కల మాస్టర్ గా కనిపించబోతున్న ఈ చిత్రానికి నందకిశోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు.

'35 – చిన్న కథ కాదు' ఫస్ట్ సింగల్

అయితే తాజాగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘సయ్యారే సయ్యా..’ అంటూ సాగే ఈ స్నేహ గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలు, స్నేహితులను గుర్తుచేసేలా ఈ పాట ఉంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా.. కార్తిక్ పాడారు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదల కానుంది.

Also Read: Allu Arjun: వయనాడ్‌ బాధితులకు అల్లు అర్జున్ సాయం.. రూ. 25 లక్షల విరాళం - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు