Rehnaa Hai Tere Dil Mein: మాధవన్ కల్ట్ క్లాసిక్ 'రెహనా హై తేరే దిల్ మే' రీ రిలీజ్

ఆర్ మాధవన్, దియా మీర్జా జంటగా నటించిన 'రెహనా హై తేరే దిల్ మే'. 2001లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. దాదాపు 23ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 30న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు .

Rehnaa Hai Tere Dil Mein: మాధవన్ కల్ట్ క్లాసిక్  'రెహనా హై తేరే దిల్ మే' రీ రిలీజ్
New Update

Rehnaa Hai Tere Dil Mein: స్టార్ హీరో మాధవన్, దియా మీర్జా జంటగా నటించిన రొమాంటిక్ ఫిల్మ్ 'రెహనా హై తేరే దిల్ మే'. 2001 లో విడుదలైన ఈ మూవీ ఆల్ టైం కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచింది. మొదటగా థియేటర్స్ లో విడుదలైనప్పుడు ఊహించని విధంగా ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ టాక్ వచ్చింది. సినిమాలోని పాటలు, కథ బాగున్నప్పటికీ అంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత టీవీల్లో విడుదలైన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోయేలా ఆకట్టుకుంది.

'రెహనా హై టెర్రే దిల్ మే' రీ రిలీజ్

అయితే దాదాపు 23 ఏళ్ళ తర్వాత.. ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ఈ మూవీ. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఈ చిత్రాన్ని థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ఇందులో మాధవన్ మ్యాడీ పాత్రను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మాధవన్.. ఆ తర్వాత వరుస అవకాశాలతో అనేక సూపర్ హిట్ చిత్రాలను చేశాడు.

తమిళ్ ఫిల్మ్ 'మిన్నలే' రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళ్ వెర్షన్ లో మాధవన్ పాత్రను అబ్బాస్, దియా పాత్రను రీమా సేన్ పోషించారు. అయితే ఈ రెండు భాషలకు గౌతమ్ మీనన్ వాసుదేవ్ ఒక్కరే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని సచ్ కెహ్ రహా హై, దిల్ కో తుమ్సే, జరా జరా వంటి పాటలు ఆల్ టైమ్ చాట్ బస్టర్స్ గా నిలిచాయి.

Also Read: Pushpa 2: 'పుష్ప 2' కొత్త పోస్టర్.. 100 డేస్ కౌంట్ డౌన్ షురూ - Rtvlive.com

#rehnaa-hai-tere-dil-mein-re-release #rehnaa-hai-tere-dil-mein-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe