Dad beheaded own son: అమెరికాలో ఓ సైకో తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళల లో దుస్తు ధరించి పైచాచిక ఆనందం పొందుతూ కృరమృగంలా మారిపోయాడు. అంతేకాదు తాను ధరించిన అండర్ వేర్, బ్రా లోనే మలమూత్రాలు చేసి వాటినే తింటూ నీచంగా వ్యవహరించాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన సొంత కొడుకునే అతి కిరాతకంగా నరికి చంపిన ఆ దుర్మార్గుడి చేసిన ఘోరాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.
స్త్రీల లోదుస్తులు ధరించి..
ఈ మేరకు అమెరికాలోని కొలరాడో నగరానికి చెందిన మార్క్ అనే వ్యక్తి కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే మహిళల పట్ల వ్యామోహం పెంచుకున్న మార్క్.. స్త్రీల లో దుస్తులు ధరించి ఆనందం పొందటం మొదలుపెట్టాడు. కాలక్రమంలో పిచ్చి మరింత ముదరడంతో ఆఖరికి న్యాపీలోనే టాయిలెట్ చేస్తూ తినడం మొదలుపెట్టాడు. అయితే అంతటితో ఆగకుండా తన ల్యాప్‌టాప్‌లో ఈ అసభ్యకరమైన ఫొటోలన్నీ దాచుకోవడం ప్రారంభించాడు. నిరంతరం బ్రాను చూసుకుంటూ మురిసిపోవడం, అండర్ వేర్ లో మలం వేసుకుని తింటూ గలీజ్ పనులకు అలవాటు పడ్డాడు.
మార్క్ ల్యాప్ టాప్ లో కళ్లు చెదిరే ఘోరాలు..
అయితే స్కూల్ సెలవుల సందర్భంగా తన తండ్రిని చూడాలని మార్క్ దగ్గరకు వచ్చాడు కొడుకు 13ఏళ్ల డైలాన్. అయితే మార్క్ ఉంటున్న ఇంట్లో అడుగుపెట్టగానే వాతావరణం చూసి డైలాన్ చూసి కంగుతిన్నాడు. మార్క్ మాత్రం తన కొడుకు అక్కడ ఉండేందుకు అంగీకరించలేదు. అక్కడినుంచి వెళ్లిపోవాలని కోరాడు. దీంతో డైలాన్ దగ్గరలోని తన స్నేహితుడి ఇంట్లో ఉంటూ తండ్రి పనులను గమనించాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఒకరాత్రి మార్క్ ల్యాప్ టాప్ తెరిచి చూసిన డైలాన్ కు కళ్లు చెదిరే నిజాలు తారసపడ్డాయి. ఇవి తన స్నేహితుడితో పంచుకునేందుకు అక్కడికి రావాలని కోరాడు డైలాన్. కానీ అప్పటికీ డైలాన్ కు తన నిజ స్వరూపం తెలిసిపోయిందని గమనించిన మార్క్.. ఇంట్లోనే డైలాన్ తల నరికి చంపేశాడు.
నిజం బయటపెట్టిన స్నేహితుడు..
డైలాన్ ఒకరోజు రాత్రి తండ్రి ఇంటికి వెళ్లి మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు వస్తానని స్నేహితుడికి సందేశం పంపించాడు. కానీ చెప్పిన సమయం గడిచిపోయినప్పటికీ డైలాన్ రాకపోవడంతో తన స్నేహితుడు అక్కడికి వెళ్లి మార్క్ ను ప్రశ్నించాడు. ఉదయం తాను పనుల కోసం ఇంటి నుంచి వెళ్లిపోయానని, తిరిగి వచ్చేసరికి డైలాన్ కనిపించడం లేదని నమ్మించాడు. కానీ అనుమానం వచ్చిన స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆధారాలు సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మార్క్ ఫొటోలు కొన్ని బయటకు రావడంతో చాలామందికి తలతిరిగిపోయినంత పనైంది. పోలీసులు సైతం వాటిని చూడలేక వాంతులు చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి.