Life Style: సూర్యస్తమయం తర్వాత.. ఈ పనులు చేస్తే దురదృష్టం..!

సూర్యస్తమయం తర్వాత కొన్ని పనులు పనులు అస్సలు చేయకూడదు. తల దువ్వడం, ఉప్పు దానం, వంట గదిలో పాత్రలను అశుభ్రంగా వదిలేయడం, గోళ్లు, జుట్టు కత్తిరించడం మంచిది కాదు. ఇలా చేయడం దురదృష్టం, ఆర్ధిక సమస్యలను కలిగిస్తుందని చెబుతారు.

Life Style: సూర్యస్తమయం తర్వాత.. ఈ పనులు చేస్తే దురదృష్టం..!
New Update

Life Style: తెలుగు సంస్కృతిలో నమ్మకాలు, ఆచారాలు, పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు అస్సలు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. చెడు సమయాల్లో పనులు మొదలు పెడితే అశుభం కలుగుతుందని భావిస్తారు. ఇలాగే సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేస్తే అశుభం, దురదృష్టం కలుగుతాయి. అవేంటో చూడంటి.

సూర్యాస్తమయం తర్వాత అస్సలు చేయకూడని పనులు..

తల దువ్వడం, జుట్టు వదిలేసి నిద్రపోవడం

సూర్యస్తమయం తర్వాత జుట్టు దువ్వడం, జుట్టు వదిలేసి పడుకోవడం మంచిది కాదు. ఇలా జుట్టు వదిలేసి పడుకోవడం అశుభకరంగా సూచిస్తారు. ఎందుకంటే రాత్రి సమయాల్లో చెడు శక్తులు ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అనుమానం ఉంటుంది.

వంటగదిలో పాత్రలను అశుభ్రంగా వదిలేయొద్దు

చాలా మంది రాత్రి సమయాల్లో తిన్న తర్వాత పాత్రలను శుభ్రం చేయకుండా అలాగే వదిలేసి పడుకుంటారు. రాత్రి సమయాల్లో వంట గదిని అశుభ్రంగా ఉంచడం వల్ల పేదరికం, అప్పుల భాదను కలిగిస్తుందని చెబుతారు.

రాత్రి సమయాల్లో ఉప్పు, పాలు దానం చేయకూడదు

పూర్వ కాలం నుంచి కూడ సూర్యాస్తమయం తర్వాత ఉప్పు దానం చేయకూడదనే నమ్మకం ఉంది. రాత్రి సమయాల్లో ఉప్పు, పాలు, చక్కర తెల్లటి వస్తువులు ఏదీ కూడా దానం చేయకూడదని చెబుతారు. ఇలా చేస్తే జీవితంలో అస్థిరత్వం, ఆర్ధిక సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉండొచ్చు.

 గోళ్లు, జుట్టు కత్తిరించకూడదు

రాత్రి సమయాల్లో జుట్టు, గోళ్లు కత్తిరించడం దురదృష్టం. ఆ సమస్యల్లో లక్ష్మి దేవి ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు. అందుకే రాత్రి సమయంలో జుట్టు, గోళ్లు కట్ చేయవద్దని చెబుతారు.

publive-image

ఇంటిని శుభ్రం చేయకూడదు

సూర్యస్తమయం ఇంట్లో చీపురు వాడితే దురదృష్టంగా చెబుతారు. రాత్రిళ్ళు చీపురు వాడడం వల్ల కుటుంబ సభ్యులు ఆరోగ్యం, సంతోషం, ప్రశాంతతకు సంబంధించిన సమస్యలను ఎదుర్కుంటారు.

బట్టలు వాష్ చేయడం, బయట ఆరేయడం చేయకూడదు

రాత్రి సమయాల్లో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. ఈ సమయంలో బట్టలు ఆరు బయట ఆరేస్తే వాటి పై చెడు శక్తుల ప్రభావం చూపుతుంది. సూర్యోదయంలో బట్టలు ఆరేస్తే వాటిలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి.. పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. అందుకే మన ఇళ్లలో కూడా సాయంత్రం తర్వాత బట్టలు బయట ఉంచకూడదని చెబుతారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.

Also Read: Fiber Intake: మోతాదుకు మించి ఫైబర్ తీసుకుంటే.. ఆరోగ్యానికి ప్రమాదం..!

#things-never-do-after-sunset
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe