Hydra: హైడ్రా రంగనాథ్ తప్పు చేశారా?

హైడ్రా చేపట్టిన మల్లంపేట్‌ విల్లాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. ముందు 8 విల్లాలు బఫర్ జోన్‌లో ఉన్నాయని చెప్పి.. ఇప్పుడు 20 విల్లాలను నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

author-image
By V.J Reddy
New Update
hydra

Hydra: మల్లంపేట్‌ విల్లాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. హైడ్రా రంగనాథ్ తప్పు చేశారా అనే చర్చ జోరందుకుంది. నోటీసులివ్వకుండానే కూల్చారంటూ లక్ష్మి శ్రీనివాసా కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ గుర్రం లక్ష్మి, విల్లా ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. FTL, బఫర్‌జోన్‌లో ఉంటే పర్మిషన్లు ఎలా ఇచ్చారనే ప్రశ్నించారు. తమకుంటే ముందు పర్మిషన్‌ ఇచ్చిన ప్రభుత్వం, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

గతంలో బఫర్‌ జోన్‌ నిర్ధారణలో ఇరిగేషన్ అధికారులు చేతివాటం చూపించారు. కత్వ చెరువు బఫర్‌జోన్‌ పరిధిలో 8 విల్లాలు ఉన్నాయని మూడేళ్ల కిందట నీటిపారుదలశాఖ అధికారుల రిపోర్టు ఇచ్చారని బాధితులు వాపోతున్నారు. తాజాగా మళ్లీ సర్వే చేసి బఫర్‌జోన్‌లో 8 విల్లాలకు అదనంగా మరో 20 ఉన్నాయని రెవెన్యూ అధికారులు చెప్పడం దారుణమని అన్నారు. రెవెన్యూ అధికారుల నివేదికతో 20 విల్లాల్లో 13 విల్లాలను హైడ్రా అధికారులు కూల్చేశారు.

Advertisment
తాజా కథనాలు