కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హుజూర్ నగర్, కోదాడలో 50వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏండ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేదన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాను చేసిన డెవలప్ కనిపిస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ ను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ ది కాదన్న ఆయన...రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోందన్నారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ హవా నిజమవుతుందా?
అటు సీఎం కేసీఆర్ పై పలు కామెంట్స్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ బహిరంగసభలు పేలవంగా సాగుతున్నాయన్నారు. దోపిడి చేసిన సొమ్ముతో అధికారంలోకి రావాలనేది బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నమన్నారు. అలాంటి నేతలకు కాంగ్రెస్ పై విమర్శలు చేసే నైతిక హక్కులేదన్నారు. డబ్బును ఎరగా చూపి ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు..ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఛీ కొట్టడం ఖాయమన్నారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూ చూద్దాం.
ఇది కూడా చదవండి: టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్..!!