Johnny Master: జానీ మాస్టర్ అలాంటోడు.. బాంబ్ పేల్చిన హైపర్ ఆది!

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో జానీ గురించి హైపర్ ఆది ఓషోలో 'ఆయన ఆట ఆగదు' అని ఫన్నీగా చేసిన డబుల్ మీనింగ్ కామెడీ ఇప్పుడు వైరలవుతోంది. షోలో చేసిన కామెడీనే నిజమైందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

aadi

hyper aadi

New Update

Johnny Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అతని దగ్గర పనిచేసే మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను జానీ లైంగిక వేధించాడని, తనపై అత్యాచారం చేశాడని కేసు పెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జానీ పై IPC 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కామెడీగా చెప్పిన డైలాగ్స్ నిజమయ్యాయి

ఈ క్రమంలో గతంలో ఓ షోలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ జానీ మాస్టర్ పై ఫన్నీగా చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ వైరల్ అవుతున్నాయి. ఓ షోలో ఆది ఫన్నీగా మాట్లాడుతూ.. "ఈరోజు జానీ అని ఓ పెద్ద బ్యాట్స్ మెన్ వచ్చాడంట కదా.. ఆ ఆట ఆగదిక", ''ఆ చివరి జడ్జ్ అప్పులు తీరుస్తాడు.. ఈ చివరి జడ్జ్(జానీ) ఆకలి తీరుస్తాడు'' అని జానీ మాస్టర్ గురించి ఫన్నీగా మాట్లాడిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను ఇప్పుడు మళ్ళీ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. షోలో కామెడీగా చెప్పిన డైలాగ్సే ఇప్పుడు నిజమయ్యాయి అని ట్రోలింగ్ మొదలు పెట్టారు.

తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీ మాస్టర్ పై వస్తున్న లైంగిక ఆరోపణల పై ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో కమిటీ సభ్యులు జాన్సీ, తమ్మారెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. ఐదేళ్ల పాటు ఆ అమ్మాయి నరకం చూసిందని. తను 16 నుంచి 21 ఏళ్ళ వరకు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉందని తెలిపారు. ఆ అమ్మాయి యూనియన్ కార్డు తీసుకొని బెదిరించి వేధింపులకు పాల్పడ్డాడని. యువతి తల్లిదండ్రుల నుంచి కూడా సమాచారం సేకరించాం.. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి జానీ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ పేర్కొంది.

Also Read: Johnny Master: కోరిక తీర్చాలని కొట్టారు.. జానీ కేసులో కొత్త ట్విస్ట్!

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe