Johnny Master: ఐదేళ్ల పాటు నరకం చూసింది...ఫిల్మ్ ఛాంబర్‌ సంచలన నిజాలు!

జానీ మాస్టర్ పై వస్తున్న లైంగిక ఆరోపణలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఐదేళ్ల పాటు ఆ అమ్మాయి నరకం చూసిందని. దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డితో చర్చించి జానీ పై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ తెలిపింది.

New Update

Johnny Master: జానీ మాస్టర్ పై వస్తున్న లైంగిక ఆరోపణలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఐదేళ్ల పాటు ఆ అమ్మాయి నరకం చూసిందని. దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డితో చర్చించి జానీ పై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ తెలిపింది. 

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నివేదిక

అలాగే మహిళా లైంగిక వేధింపులకు సంబంధించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓ లేఖను విడుదల చేసింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్  లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ను కలిగి ఉందని. ఇది 2018లో ఏర్పాటైందని.. దీనిని  లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి నియమించడం జరిగిందని తెలిపింది. ప్రస్తుతం ప్యానెల్ మహిళా కొరియోగ్రాఫర్ నుంచి వచ్చిన ఫిర్యాదును స్వీకరించిందని. దీనికి సంబంధించిన విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని కూడా ప్యానెల్ ఏర్పాటు చేసినట్లు లేఖలో తెలిపారు. అంతేకాదు ఆరోపణలు ఎదుర్కుంటున్న సదరు కొరియోగ్రాఫర్ ను విచారణ పూర్తయ్యే వరకు యూనియన్ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తాత్కాలికంగా తొలగించడం జరుగుతుందని కమిటీ నివేదికను ఇచ్చింది. 

film chamber

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe