Bezawada Bebakka: నా ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడు.. అంతా షాకయ్యారు..!

బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన బేబక్క తొలివారమే ఎలిమినేట్ అయ్యింది. తాజాగా RTV ఇంటర్వ్యూలో పాల్గొన్న బేబక్క తన గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. ఒకసారి తనను ఓ అబ్బాయి తాకకూడని చోట తాకడంతో వాడిని అందరి ముందు గట్టిగా కొట్టినట్లు చెప్పింది.

New Update

Bezawada Bebakka: నేను మీ బెజవాడ బేబక్క అంటూ సోషల్ మీడియాలో రీల్స్, వీడియోస్ ద్వారా పరిచయమైనా బేబక్క తన ప్రత్యేకమైన భాష, యాసతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 8లో ఆఫర్ కొట్టేసిన బేబక్క.. అంతే త్వరగా బయటకు వచ్చేసింది. తన కామెడీ టైమింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో బిగ్ బాస్ లో ఎక్కువ కాలమే సర్వైవ్ అవుతుందని అనుకున్న బేబక్క మొదటి వారమే ఎలిమినేటై అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఎలిమినేషన్ తర్వాత బయటకు వచ్చిన బేబక్క గత వారం రోజులుగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది.

తాకరాని చోట తాకాడు ఒక్కటిచ్చాను

ఈ క్రమంలో తాజాగా ఆర్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న బేబక్క బిగ్ బాస్ తో పాటు తన వ్యక్తిగతానికి సంబంధించి కూడా పలు ఆసక్తికర విషయాలు మాట్లాడింది. యాంకర్.. లైఫ్ లో ఎవరినైనా కొట్టారా.? అని బేబక్కను అడగగా.. ఆమె చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను ఓ సారి థియేటర్ కి వెళ్లినప్పుడు ఓ అబ్బాయి తనను తాకకూడని చోట తాకి వెళ్లిపోయాడని. దాంతో అతని వెనకాలే వెళ్లి థియేటర్ లో అందరి ముందు గట్టిగా ఒక్కటిచ్చాను అని తెలిపింది.

అలాగే బేబక్క తన బిగ్ బాస్ అనుభవం గురించి కూడా పంచుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తనకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందంగా ఉందని. బిగ్ బాస్ లో తాను లేకపోయిన ఇప్పటికీ హౌజ్ మేట్స్ తన పేరును నామినేషన్స్ లో గుర్తుచేసుకుంటున్నారని తెలిపింది. అలాగే విష్ణు ప్రియా విషయంలో సోనియా మాట్లాడిన మాటలకు కోపం వచ్చిందని. విష్ణు బాధపడుతుంటే తనకు కళ్ళలో నీళ్లు వస్తున్నాయని బాధపడింది. హౌస్ లో సోనియా వల్ల విష్ణు చాలా ఇబ్బంది పడినట్లుగా చెప్పింది.

Also Read: Johnny Master: కోరిక తీర్చాలని కొట్టారు.. జానీ కేసులో కొత్త ట్విస్ట్!

Advertisment
తాజా కథనాలు