Google Search : ఏం విషయం తెలుసుకోవాలన్నా... గూగుల్ సెర్చ్ ఇంజిన్(Google Search Engine) కు వెళ్లాల్సిందే. గూగుల్ లేనిదే ఇప్పుడు ఏ పని కావడం లుదు. కొత్త కొత్త విషయాలను ఎప్పటికప్పుడు అందిస్తున్న గూగుల్ ఇంటర్నెట్ వినియోగించడం తెలిసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైంది. అయితే గూగుల్ ప్రతిఏటా చివరన తన సెర్చ్ ఇంజన్ పనితీరు, వినియోగదారులు ఎక్కువగా వెతికిన అంశాలను గురించి కీలక విషయాలను వెల్లడిస్తుంది. ఈ ఏడాది అంటే 2023 చివరిలో కూడా గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాలపై జాబితా విడుదల చేసింది.
గూగుల్ రిలీజ్ చేసిన జాబితాలో ట్రెండింగ్ టాపిక్ నుంచి జానదరణ పొందిన వీడియోల వరకు చాలా ఉన్నాయి. చంద్రయాన్ 3(Chandrayaan-3) సక్సెస్ ఫుల్ లాండింగ్ నుంచి కర్నాటక ఎన్నికల వరకు జి20 సమ్మిట్ రాజకీయ ఘటనలపై ఈ ఏడాదిలో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల జాబితాలో ఉన్నాయి. వీటితోపాటు క్రికెట్ ప్రపంచ కప్ అప్ డేట్స్ సెర్చ్ చేసేందుకు ఎక్కువ మంది ప్రత్యేకించి ఆసక్తి కనబరిచారు.
భారతదేశంలో 2023లో టాప్ ట్రెండింగ్ శోధనల యొక్క మొత్తం 12 జాబితాలను గూగుల్ విడుదల చేసింది. ఈ జాబితాలో, న్యూస్ ఈవెంట్, హౌ టు, స్పోర్ట్ ఈవెంట్‌లు మొదలైనవాటికి సంబంధించిన టాప్ సెర్చ్‌ల గురించిన సమాచారం ఇచ్చిది. ప్రతి విభాగంలోని టాప్ 5 శోధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
2023లో వార్తల ఈవెంట్ యొక్క టాప్ 5 సెర్చింగ్స్:
1 చంద్రయాన్-3
2 కర్ణాటక ఎన్నికల ఫలితాలు
3 ఇజ్రాయెల్ వార్తలు
4 సతీష్ కౌశిక్
5 బడ్జెట్ 2023
2023లో ఏముంది అనే టాప్ 5 సెర్చింగ్స్:
1 G20 అంటే ఏమిటి?
2 UCC అంటే ఏమిటి?
3 చాట్ GPT అంటే ఏమిటి?
4 హమాస్ అంటే ఏమిటి?
5 సెప్టెంబర్ 28, 2023న ఏమిటి ?
2023లో ఎలా చేయాలి అనే టాప్ 5 శోధనలు:
1 హోం రెమెడీస్‌తో చర్మం, జుట్టుకు సన్ డ్యామేజ్‌ను ఎలా నివారించాలి
2 Youtubeలో నా మొదటి 5K ఫాలోవర్స్ ను ఎలా చేరుకోవాలి?
3 కబడ్డీలో రాణించటం ఎలా?
4 కారు మైలేజీని ఎలా మెరుగుపరచాలి?
5 చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా ఎలా మారాలి?
2023లో భారతదేశంలోని టాప్ 5 క్రీడాల్లో సెర్చ్:
1 ఇండియన్ ప్రీమియర్ లీగ్
2 క్రికెట్ ప్రపంచ కప్
3 ఆసియా కప్
4 మహిళల ప్రీమియర్ లీగ్
5 ఆసియా క్రీడలు
2023లో నా దగ్గర ఉన్న టాప్ 5 శోధనలు:
1 నా దగ్గర కోడింగ్ తరగతులు
2 నా దగ్గర భూకంపం
3 జూడియో నా దగ్గర
4 నా దగ్గర ఓనం సధ్య
5 నా దగ్గర జైలర్ సినిమా
ఇక టూరిస్ట్ ప్లేసుల విషయానికొస్తే.. ఈ సంవత్సరం భారతీయులు ఎక్కువ సెర్చ్ చేసిన దేశం వియాత్నం. దీని తర్వాత గోవా, ఇండోనేషియాలోని బాలి, శ్రీలంక, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాలను ఎక్కువగా సెర్చ్ చేసిన జాబితాలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ‘అయ్యో జగన్’.. అంటూ సీఎం జగన్ పై లోకేష్ చురకలు