Land On The Moon price: తల్లికి గిఫ్ట్‌గా.. చంద్రుడిపై స్థలం.. రేట్ ఎంతో తెలుసా..?

లూనార్ రిజిస్ట్రీ ప్రకారం.. చంద్రునిపై ఒక ఎకరం భూమి ధర USD 37.50 అంటే భారత్ కరెన్సీలో దాదాపు రూ. 3,100. ఈ నెల 23న సాయంత్రం 6:04 గంటలకు జాబిల్లి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వగా.. కొందరు మాత్రం అప్పుడే చంద్రుడిపై స్థలాలు కూడా కొనేస్తున్నారు. తాజాగా తెలంగాణకి చెందిన ఓ యువతి ఏకంగా చంద్రుడిపై ఎకరం స్థలం కొనేసింది.

Land On The Moon price: తల్లికి గిఫ్ట్‌గా.. చంద్రుడిపై స్థలం.. రేట్ ఎంతో తెలుసా..?
New Update

Land rate on moon: చంద్రుడిపై చంద్రయాన్-3 సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయింది. దీంతో, యావత్ ప్రపంచం భారత్‌కు సలాం కొట్టింది. అయితే ఇప్పుడు మరో చర్చ స్టార్ట్ అయింది. చంద్రుడిపై మనుషులు బ్రతకగలరా లేదా..?కానీ, ఈ క్వశ్చన్ కు ఎవరి దగ్గరా ఆన్సర్ లేదు.ఇదిలా ఉంటే కొందరు మాత్రం అప్పుడే చంద్రుడిపై స్థలాలు కూడా కొనేస్తున్నారు. తాజాగా తెలంగాణ(telangana)కి చెందిన ఓ యువతి ఏకంగా చంద్రుడిపై ఎకరం స్థలం కొనేసింది.



చందమామ రావే..జాబిల్లి రావే అని గోరుముద్దలు తినిపించిన తల్లికి ఆశ్చర్యపోయే గిఫ్ట్ ఇచ్చింది కూతురు. పెద్దపల్లి జిల్లా(peddapalli district) గోదావరిఖనికి చెందిన రాంచందర్, వకుళాదేవిల పెద్ద కూతురైన సాయి విజ్ఞత అమెరికాలో ఉంటోంది..ప్రతి సంవత్సరంలాగే తల్లికి మదర్స్ డే గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంది. కానీ, రొటీన్ గిఫ్ట్ కాకుండా.. కొత్తగా ఉండాలనుకుంది. ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో ఏకంగా చంద్రుడిపైనే స్థలం కొనేసింది. ఆ స్థలాన్ని తల్లి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి.. గిఫ్ట్‌గా ఇచ్చింది. దీంతో, కొండంత ప్రేమ చూపిస్తున్న కూతుర్ని చూసి.. తల్లి ఫుల్ ఖుషీ అయింది.

publive-image మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చిన విజ్ఞత

అయితే, ఈ న్యూస్ చూసిన కొందరు అసలు ఇదెలా సాధ్యం.. అలా ఎలా కొంటారు..? ఎకరం రేట్ ఎంతుంటుంది అనే క్యూస్షన్స్ రైజ్ చేస్తున్నారు.దీనికి ఆన్సర్ గా.. లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్ సైట్ లో చంద్రుడిపై స్థలం కొనొచ్చు. ముందుగా వెబ్ సైట్ లోకి వెళ్లి..కొనాలనుకున్న ప్లేస్ ని సెలక్ట్ చేసుకోవాలి. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, డ్రీం ఆఫ్ లేక్స్ సహా మరికొన్ని ప్రాంతాలు ఉంటాయి. అందులో నచ్చిన ప్లేస్ ని రిజిస్ట్రేషన్ చేసుకొని.. డాక్యూమెంట్లను పొందొచ్చు.



గతంలో ఎవరు కొనుగోలు చేశారంటే?

అయితే, ఇక్కడిలానే చంద్రుడి మీద కూడా స్థలానికి భారీ రేట్లే ఉన్నాయి. ఒక ఎకరం ధర 3వేల 100 రూపాయలు. అసలు అక్కడ మనుషులు బ్రతకగలరా లేదా అనే క్లారిటీ లేకుండానే.. జనాలు మాత్రం స్థలాలు కొనేస్తున్నారు.ఇప్పటికే కొందరు సెలెబ్రిటీలు కూడా చంద్రుడిపై స్థలాలు కొనేశారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా ఉన్నారు. ఈ భూమిని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ ద్వారా కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన రాజీవ్ బగ్డి, బెంగళూరుకు చెందిన లలిత్ మోహతా కూడా చంద్రుడిపై స్థలం కోనుగోలు చేశారు. ఆగస్టు 23న చంద్రయాన్-3 జాబిల్లి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యింది. 1967 నాటి ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం, ఏ దేశం లేదా వ్యక్తి కూడా అంతరిక్షంలో ఉపగ్రహాన్ని లేదా గ్రహాన్ని చట్టబద్ధంగా కలిగి ఉండేందుకు అనుమతి లేదు. మనదేశంతో పాటు 110 ఇతర దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి.

#chandrayaan-3
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe