Chandrababu Naidu Announces Candidates : ఏపీ రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయి. ఓవైపు అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే విడతల వారీగా మూడు లిస్టులు వదిలింది. నాలుగో లిస్ట్‌ను రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ(TDP-Janasena-BJP) పొత్తులతో పాటు సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతున్నాయి. ఈ డిస్కషన్స్ కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. అయితే బీజేపీ కూటమిలో భాగంగా ఉంటుందా లేదా అన్నది తేలాల్సి ఉండగా.. పవన్, చంద్రబాబు మాత్రం కలిసే వెళ్లనున్నట్టు ఇప్పటికే పలుమార్లు ఓపెన్‌గా ప్రకటించారు. ఇక ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి అభ్యర్థుల పేర్లు బయట పెట్టని టీడీపీ తాజాగా ముగ్గురు అభ్యర్థుల పేర్లను అనాధికరికంగా చెప్పేసింది. ఆ మూడు పేర్లు కూడా స్వయానా చంద్రబాబునాయుడు(Chandrababu) నోట నుంచి రావడంతో ఇక వారి పేర్లు ఫిక్స్ చేసేసుకోవడమే!
ఆ ముగ్గురు ఎవరు? ఎక్కడంటే?
గుడివాడలో నిర్వహించిన 'రా కదలిరా'(Raa Kadali Raa) బహిరంగ సభలో చంద్రబాబు ముగ్గురు అభ్యర్థుల పేర్లను చెప్పారు. గుడివాడ(Gudivada) సభ వేదిక మీద నుంచి కృష్ణాజిల్లాలో మూడు నియోజకవర్గాల టీడీపీ అభ్యర్దులను కన్ఫర్మ్ చేశారు చంద్రబాబు. గుడివాడలో వెనిగండ్లరాము , మచిలీపట్నంలో కొల్లురవీంద్ర, గన్నవరంలో యార్లగడ్డను గెలిపించాలని చంద్రబాబు కోరారు. గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని అని తెలిసిందే. ఇక గన్నవరంలో వల్లభనేని వంశీ వైసీపీ నుంచి పోటి చేసే అవకాశం ఉండగా.. మచిలీపట్నంలో ఎమ్మెల్యే పేర్నినాని కొడుకు కిట్టుకు టికెట్ ఇవ్వనున్నారు జగన్.
హోరాహోరీ తప్పదు:
ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) గన్నవరంలో టీడీపీ నుంచి విజయం సాధించిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత వైసీపీకి మద్దతుగా మారారు. వంశీని మొదట్నుంచీ యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తూ వచ్చారు. వీరిద్దరు కూడా గతంలో వంశీపై వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడినవారే. ఈ క్రమంలోనే ఇద్దరు వంశీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేశారు. మరోవైపు మచిలీపట్నంలో 2014లో కొల్లు రవీంద్ర టీడీపీ నుంచి గెలుపొందారు. ఆ సమయంలో జనసేన టీడీపీ పక్షాన నిలపడింది. 2019లో రవీంద్ర ఓడిపోయారు. ఆ సమచంలో జనసేన టీడీపీ పక్షాన లేదు. ఇక రానున్న(2024)ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసే వెళ్లనున్నాయి. మరి కొల్లు రవీంద్ర 2014 రిజల్ట్‌ను రిపీట్ చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
Also Read: వస్తారు.. పోతారు.. పాండ్యాపై షమీ షాకింగ్ కామెంట్స్!
WATCH: