విస్తృత సంప్రదింపుల తర్వాతే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ.. పార్లమెంటులో వెల్లడించిన కేంద్రం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై విస్తృత స్థాయి సంప్రదింపుల అనంతరమే ముందుకు వెళ్లనున్నట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలియజేసింది. వ్యూహాత్మక విక్రయానికి భాగస్వామ్యపక్షాలతో చర్చించిన అనంతరమే ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు.

విస్తృత సంప్రదింపుల తర్వాతే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ.. పార్లమెంటులో వెల్లడించిన కేంద్రం
New Update

Vizag Steel plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై విస్తృత స్థాయి సంప్రదింపుల అనంతరమే ముందుకు వెళ్లనున్నట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలియజేసింది. వ్యూహాత్మక విక్రయానికి భాగస్వామ్యపక్షాలతో చర్చించిన అనంతరమే ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ను నూరు శాతం విక్రయానికి 2021 జనవరిలోనే కేబినెట్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: మరోసారి చిరుత కలకలం.. తిరుమలలో భక్తుల ఆందోళన

‘‘విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీకి ఒక రూపు తెచ్చేందుకు విస్తృత స్థాయిలో సంప్రదింపులు అవసరం. ఈ లావాదేవీలో భూములు, ఇతర ఆస్తులు కూడా విక్రయించనున్నాం. వివిధ భాగస్వామ్యపక్షాలతో చర్చల అనంతరం ఆసక్తి వ్యక్తీకరణలు ఆహ్వానిస్తాం’’ అని కరాడ్‌ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: బ్యాటర్లకు ఇక కళ్లెం.. బీసీసీఐ తాజా నిర్ణయంతో పేసర్లకు అడ్వాంటేజ్!

ఉద్యోగులు, యూనియన్ల వల్లే ఆలస్యం అవుతోందా? అనే ప్రశ్నకూ కరాడ్‌ సమాధానం ఇచ్చారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌, కంటెయినర్‌ కార్పొరేషన్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా, ఎయిరిండియా అనుబంధ ఏఐ అసెట్‌ హోల్డింగ్‌ విక్రయానికి కేబినెట్‌ ఆమోదం లభించినప్పటికీ.. ఈ మూడింటి విషయంలోనూ ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానించలేదని పేర్కొన్నారు. కాగా, కొన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

#vizag-steel-plant
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe