Catherine Tresa: కలిసి రాని కాలం..డల్ అయిన ఐకాన్ స్టార్ బ్యూటీ..!

కేథరిన్ ట్రెసా లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సరైనోడు మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నటించిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోతోంది. మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది ఈ బ్యూటీ.

Catherine Tresa: కలిసి రాని కాలం..డల్ అయిన ఐకాన్ స్టార్ బ్యూటీ..!
New Update

Catherine Tresa: కేథరిన్ ట్రెసాకు కాలం కలిసి రాలేదు. పైసా, సరైనోడు, రుద్రమదేవి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. వరుసగా పరాజయాలు ఎదురుకుంటుంది ఈ అమ్మడు.

publive-image

అయితే, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఫొటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. తెలుగులో చమ్మక్ చల్లో మూవీతో అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. అనూహ్యంగా అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. సరైనోడు లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆ మూవీలో లేడి ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ అదరగొట్టేసింది. సరైనోడు మంచి సక్సెస్ సాధించింది.

publive-image

సరైనోడు చిత్రం నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించింది. ఆ తరువాత జయ జానకీ నాయక మూవీలో ఐటం సాంగ్ కూడా చేసింది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో హీరోయిన్ గా నటించింది. అయితే, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.

publive-image

బింబిసార మూవీతో కేథరిన్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. మాచర్ల నియోజకవర్గంలో నటించిన  ఆ సినిమా ప్లాప్ అయింది. వాల్తేరు వీరయ్యలో రవితేజ భార్య రోల్ చేసింది. అయితే ఈ మూవీలో కేథరిన్ పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. కెరీర్ లో మంచి హిట్లు అందుకోలేక పోయినా మంచి ఆఫర్ల కోసం వెయిట్ చేస్తుంది.

Also Read: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మంచు లక్ష్మీ..హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ..!

#catherine-tresa
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe