Tirumala: రమణ దీక్షితులపై టీటీడీ ఫిర్యాదు.. తిరుమల వన్‌టౌన్‌ లో కేసు నమోదు..!

తిరుమల శ్రీవారి ఆలయ రమణ దీక్షితులు వివాదంలో చిక్కుక్కున్నారు. టీటీడీ ప్రతిష్ఠ దిగజార్చేలా రమణదీక్షితులు వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీ ఫిర్యాదు చేసింది. దీంతో తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Tirumala: రమణ దీక్షితులపై టీటీడీ ఫిర్యాదు.. తిరుమల వన్‌టౌన్‌ లో కేసు నమోదు..!
New Update

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుపై టీటీడీ ఫిర్యాదుతో తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ పరిపాలన అంశాలు, అధికారులు, పోటు సిబ్బంది, జీయంగార్లపై రమణ దీక్షితులు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టు సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

ప్రతిష్ఠ దిగజార్చేలా...

ఈ నేపథ్యంలో టీటీడీ ప్రతిష్ఠ దిగజార్చేలా రమణదీక్షితులు వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీకి చెందిన సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌ అధికారి మురళీ సందీప్‌ శుక్రవారం రాత్రి 10 గంటలకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు సెక్షన్‌ 153ఏ, 295, 295ఏ, 505(2), రెడ్‌విత్‌ 120 మేరకు కేసు నమోదు చేసినట్టు సమాచారం. మరోవైపు నిధుల కోసం ప్రయత్నిస్తున్నామంటూ రమణదీక్షితులు తమపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అహోబిలం మఠం నుంచి కూడా టీటీడీకి శనివారం ఓ లేఖ అందింది.

Also Read: అగ్గిపెట్టె సైజులో వాషింగ్ మెషీన్.. ఆంధ్ర కుర్రాడు గిన్నిస్‌ రికార్డు!

publive-image

ఇదిలా ఉండగా చాలాకాలం తరువాత శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి ఆలయంలో రమణదీక్షితులు ప్రత్యక్షం కావడం విశేషం. శ్రీవారిని దర్శించుకుని సుమారు గంటపాటు ఆలయంలోనే గడిపిన ఆయన చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ కనిపించారు. ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన అనంతరం రమణదీక్షితులు మీడియాతో మాట్లాడారు.

అలా మాట్లాడలేదు..

ప్రస్తుతం ఆలయంలో కైంకర్యాలు సక్రమంగానే జరుగుతున్నాయా అనే ప్రశ్నకు బదులిస్తూ.. తరతరాలుగా చేసే కైంకర్యాలనే ఇప్పటికీ చూస్తున్నామన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో తనది కాదని ఇప్పటికే స్పష్టత ఇచ్చానన్నారు. తానెప్పుడు అలా మాట్లాడలేదని, అది తన స్వభావం, సంస్కృతి కాదన్నారు. చేయని తప్పునకు తనను బాధితుడిని చేస్తే ఏం చేయలేనన్నారు. పోలీసు కేసు అంశంపై మీడియా ప్రశ్నించగా ‘చూస్తాను’ అంటూ వెళ్లిపోయారు.

#tirumala #ttd
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe