Brahmamudi Serial: కావ్య, తన బావ పై రివర్స్ గేమ్ మొదలు పెట్టిన రాజ్.. వాళ్ళిద్దరినీ దగ్గరుండి మరీ ఆఫీస్ కు పంపిస్తాడు. కావ్యను తను బావతో షికారుకు కూడా వెళ్ళమని చెప్తాడు. కావ్య తన బావతో ఉంటే కుల్లుకునే రాజ్.. ఇలా ప్రవర్తించడంతో కావ్య షాకవుతుంది.
ప్లాన్ రివర్స్ అవడంతో కావ్య.. ఇందిరాదేవికి ఫోన్ చేస్తుంది. అమ్మమ్మ గారు.. మనం అనుకున్నది ఏదీ జరగడం లేదు. ఆయన మమల్ని అసలు పట్టించుకోవడం లేదు, దగ్గరుండి మరీ మమల్ని షికారుకు పంపారు అని చెప్తుంది. దీంతో ఇందిరాదేవి అప్పుడే నిరాశ పడితే ఎలా.. వాడు పైకి అలా చేస్తున్నాడు కానీ, లోపల చాలా జెలసీగా ఫీల్ అవుతున్నాడు అని కావ్యకి దైర్యం చెప్తుంది. ఆ తర్వాత రాజ్ కు ఫోన్ చేసిన ఇందిరాదేవి .. తాతయ్యకు మందులు అయిపోయాయి వెంటనే తీసుకొని ఇంటికి రమ్మని చెప్తుంది.
మరో వైపు కళ్యాణ్ అప్పుతో తన భాదను షేర్ చేసుకుంటాడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అనామిక కూడా తనను అర్థం చేసుకోవడం లేదు అని ఫీల్ అవుతాడు. అసలు ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు అని బాధపడతాడు. దీంతో అప్పు.. నీ భార్య ఆలోచనలో కూడా తప్పులేదు, తన భర్త గొప్పగా ఉండాలని కోరుకుంటుంది.
నీకు ఆఫీస్ కు వెళ్ళడం ఇష్టం లేకపోతే.. నీకు నచ్చిన కవితలు రాసి నువ్వెంటో ప్రూవ్ చేసుకో అని కళ్యాణ్ కు సలహా ఇస్తుంది.
ఇక అప్పు తనతో ఎప్పుడూ ఇలాగే ఫ్రెండ్లీ గా ఉండాలని ప్రామిస్ చేయించుకుంటాడు కళ్యాణ్ . ఇంతలో అటుగా వెళ్తున్న అనామిక అప్పు, కళ్యాణ్ ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం చూసి రగిలిపోతుంది. వెంటనే వెళ్లి అప్పు పరువు తీయాలని అనుకుంటుంది. కానీ ధాన్యలక్ష్మి మాత్రం ఇప్పుడు వద్దు అని చెప్పి కోడల్ని ఆపేస్తుంది.
రాజ్ వాళ్ల తాతయ్య కోసం మందులు తీసుకొని ఇంటికి వస్తాడు. రాజ్ రాగానే.. ఏమీ తెలియనట్లు కావ్య ఎక్కడ అని అడుగుతుంది ఇందిరాదేవి . దీంతో రాజ్ తన బావతో షికారుకు వెళ్ళింది.. ఇప్పట్లో రాదులే అని చెప్తాడు. ఇంతలోనే కావ్య, తన బావ ఎంట్రీ ఇస్తారు.
కావ్య, తన బావతో ఇంటికి రాగానే.. అప్పుడే వచ్చారు ఏంటీ అని అడుగుతాడు రాజ్. దీంతో కావ్య చాలా ట్రాఫిక్ ఉంది అందుకే తిరిగి వచ్చేశామని వెటకారంగా మాట్లాడుతుంది. భార్యను మరింత ఉడికించాలని ఫిక్స్ అయిన రాజ్.. కావ్య కోసం పాస్ పోర్ట్ రెడీ చేసి తీసుకొస్తాడు. అది కావ్యకు ఇచ్చి.. తన బావతో హ్యాపీగా అమెరికా వెళ్ళిపొమ్మని చెప్తాడు. దీంతో కావ్య అశ్చర్య పోతుంది.
ఇక రాజ్ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేకపోవడంతో నిరాశ చెందుతుంది కావ్య. ఎన్ని ప్లాన్స్ వేసిన ఆయన నా పై ఉన్న ప్రేమను బయట పెట్టేలా లేరు. నేను ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాల్సిందే అని ఇందిరాదేవితో బాధపడుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: Kiran Abbavaram: తన మొదటి సినిమా హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం..!