Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ లో ఫస్ట్ టైం అనామిక అసలు నిజ స్వరూపం క్లీయర్ గా చూపించారు. కావాలనే కావ్యను బ్యాడ్ చేసేందుకు తన ఫస్ట్ నైట్ ను తానే క్యాన్సిల్ చేసుకునేలా స్కేచ్ వేసింది అనామిక. ఇంట్లో అందరి ముందు పంచాయితీ పెడుతుంది. కావ్యను అందరి దృష్టిలో బ్యాడ్ చేసి ఇంట్లో అందరిని తన వైపు తిప్పుకోవాలని చూస్తుంటుంది. పైకి అనామిక అందిరి ముందు మంచిగా నటిస్తున్న కావ్య ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ సింపితి ట్రై చేస్తుంది.
అనామిక డ్రామా
ఇంట్లో అందరూ కావ్యను తిడుతారు. కావ్య వల్లే శోభనం ఆగిపోయిందని అనుకుంటారు. కానీ, అనామిక డ్రామాలు ఆడుతున్న సంగతి ఎవరికి తెలియదు. అయితే, భర్త రాజ్ మాత్రం కావ్యకు అండగా నిలబడుతాడు. తన పిన్నికి ఎదురు సమాధానం చెబుతాడు. కళ్యాణ్ ను కూడా అరుస్తాడు..భర్త అండగా నిలబడడంతో కావ్య ఎమోషనల్ అవుతుంది. రూమ్ లోకి వెళ్లీ ఎడుస్తూ కూర్చుండగా భర్త రాజ్ తనను ఒదారుస్తాడు.
ఆస్తి కోసమే స్కెచ్
అనామిక తన తల్లిదండ్రులకు ఫొన్ చేసి అనుకున్న ప్లాన్ ప్రకారమే శోభనం క్యాన్సిల్ చేశాను అని చెబుతుంది. ఆస్తి కోసం..వాళ్ల అప్పులు తీర్చడం కోసం అనామిక తల్లిదండ్రులు కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఎలాగైనా కళ్యాణ్ ద్వారా ఆస్తి కొట్టేయాలని పథకం ప్రకారమే పెళ్లీ చేశారు. ఇంట్లో ఎవరికి అనామిక తల్లిదండ్రుల గురించి పూర్తిగా తెలియదు. కూతురి ద్వారా ఎలాగైనా ఆస్తి దక్కించుకొని..కళ్యాణ్ ను ఇల్లరికం తెచ్చుకోవాలని ప్లాన్స్ వేస్తున్నారు.
శ్వేతతో రాజ్
ఇదిలా ఉండగా రాజ్ ఆఫీస్ కు వెళ్లకుండా శ్వేత దగ్గరకు వెళ్తాడు. ఆ వీడియోను ఎవరో గుర్తి తెలియని వ్యక్తి కావ్యకు పంపిస్తాడు. ఆ వీడియో చూసిన కావ్య షాక్ అవుతుంది. అయితే, చాలా ఎపిసోడ్స్ నుంచి శ్వేత అనే ఆమె రాజ్ తో క్లోజ్ గా ఉంటున్నట్లు చూపిస్తున్నారు కానీ, అసలు ఆమె ఎవరూ.. రాజ్ తో ఎందుకు కనిపిస్తుంది, వారిద్దరికి సంబంధం ఏమిటి? అని మాత్రం తెలియడం లేదు. మరోవైపు అనామిక గురించి పూర్తిగా తెలుసుకోకుండా కళ్యాణ్ పెళ్లి చేసుకుని తప్పు చేశాడని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Also Read: ముకుంద ప్లాన్ సక్సెస్.. కృష్ణ, మురారి శోభనం క్యాన్సిల్..!