Brahmamudi Serial: కావ్యపై కన్నెర్ర చేసిన అత్త.. భార్యకు అండగా రాజ్.. హీరోయిన్ ఎమోషనల్..!

బ్రహ్మముడి సీరియ‌ల్‌లో కళ్యాణ్ శోభనం చెడిపోవడానికి కావ్యే కారణమని ధాన్యల‌క్ష్మి, అనామిక ఇద్దరూ ఆమెను టార్గెట్ చేస్తూ మాట‌ల‌తో హింసిస్తారు. కానీ, రాజ్ మాత్రం కావ్యకు అండగా నిలబడుతాడు. దీంతో కావ్య ఎమోషనల్ అవుతుంది. మరోవైపు స్వప్న తన అత్తకు పనులు చెబుతూ చుక్కలు చూపిస్తుంది.

Brahmamudi Serial: కావ్యపై కన్నెర్ర చేసిన అత్త.. భార్యకు అండగా  రాజ్.. హీరోయిన్ ఎమోషనల్..!
New Update

Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియ‌ల్‌లో కళ్యాణ్ శోభనం చెడిపోవడానికి కావ్యే కారణమని ధాన్యల‌క్ష్మి, అనామిక ఇద్దరూ ఆమెను టార్గెట్ చేస్తూ మాట‌ల‌తో హింసిస్తారు. కళ్యాణ్ ఎప్పుడూ అప్పు, అనామిక ప్రస్తవన తెస్తున్నాడని అనామిక ఇంట్లో వారికి కంప్లైంట్ చేస్తుంది. దీంతో అత్త  ధాన్యల‌క్ష్మి మళ్లీ కావ్య పై దండయాత్ర చేస్తుంది. కావ్య వల్లే శోభనం ఆగిపోయిందని.. కళ్యాణ్ అనామిక సంతోషంగా ఉండడం ఇష్టం లేదని అందరి ముందు నానా మాటలు అంటుంది.

publive-image

దయచేసి వదిలేయండి..

అందరి మాటలపై విసుగెత్తి పోయిన కావ్య దయచేసి చేసి నా గురించి అప్పు గురించి మీరు వదిలేయండి. మా ప్రస్తవన తీసుకురాకండి. మీరు కొత్తగా పెళ్లి అయిన వాళ్లు మీ గురించి మీరు మాట్లాడుకోండి అని అనామికకు చెబుతుంది. తనను, తన చెల్లి అప్పును గొడవల్లో లాగకండి అంటూ ఆవేదనతో చెబుతుంది. ఇంట్లో అందరూ కావ్యపై నిందలు వేసినా భర్త రాజ్ మాత్రం కావ్యకు అండగా నిలబడుతాడు. కావ్య ఏ తప్పు చేయలేదని సపోర్ట్ చేస్తాడు.

publive-image

కావ్య ఎమోషనల్

తన భర్త తనకు అండగా నిలబడడంతో కావ్య చాలా ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే అప్పుకు హస్పిటల్ బిల్లు కూడా రాజ్ కడుతాడు. ఆ విషయం కూడా కావ్యకు తెలుస్తోంది. తన భర్త రాజ్ తనను అన్ని విషయాల్లోనూ అర్థం చేసుకుంటూ అండగా నిలబడుతాడు కాని శ్వేత విషయంలోనే ఎందుకు అబద్దాలు చెప్పాడని ఫీల్ అవుతుంది.

publive-image

ఇదిలా ఉండగా, మరోవైపు స్వప్న తన అత్తకు చుక్కలు చూపిస్తుంది. ఇష్టం వచ్చినప్పుడల్లా పిలుస్తూ కాఫీ తా, టాబ్లెట్స్ ఇవ్వూ, వాటర్ తా, పాయసం చెయి అంటూ ఆర్డర్లు వేస్తుంది. స్వప్నకు సేవలు చేయలేక అల్లాడిపోతుంది అత్త రుద్రాణి. అయితే, ఫ్యాన్స్ మాత్రం ఖుషిగా ఫీలవుతున్నారు. ఎందుకంటే అత్త రుద్రాణే ఇంట్లో అందరికి చిచ్చు పెడుతుంటుంది. ఇలా బ్రహముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

Also Read: బచ్చన్ ఇంట్లో గొడవలు.. ఐశ్వర్య-అభిషేక్ విడాకులు ఫిక్స్?

#brahmamudi-serial
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe