Brahmamudi Serial: భర్త కళ్యాణ్ మనసుని అర్థం చేసుకోమని అనామికకు నీతులు చెప్తుంది కావ్య. తోడికోడలు పై ఈగోతో రగిలిపోతున్న అనామిక కావ్య మాటలు ఏ మాత్రం లెక్క చేయకుండ తిరిగి కావ్య పై రెచ్చిపోతుంది.
అనామిక తన చెల్లిని అలా మాట్లాడడం తట్టుకోలేని స్వప్న ఈడ్చి కొడితే మూతి పళ్ళు రాలుతాయి అంటూ అనామికను గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. కళ్యాణ్ ప్రేమను అర్థం చేసుకోకపోతే.. నీ బ్రతుకంతా రోడ్డు పై పేపర్లు అమ్ముకోవడమే అని హెచ్చరిస్తుంది స్వప్న. అక్కా, చెల్లల దెబ్బకు అనామిక మొహం మాడిపోతుంది.
హాల్లో అందరూ భోజనం చేయడానికి వస్తారు. కళ్యాణ్ మాత్రం లేకపోవడంతో.. తమ్ముడు రాలేదేంటని అడుగుతాడు రాజ్. ఇంత అవమానం జరిగిన తర్వాత ఏం మొహం పెట్టుకొని వస్తాడు అంటూ వెటకారం చేస్తుంది రుద్రాణి.
తమ్ముడు బాధను తట్టుకోలేని రాజ్.. తాను కూడా భోజనం చేయనని అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. ఇంతలో కావ్య.. మీరు కూర్చోండి కళ్యాణ్ ను నేను వెళ్లి తీసుకొస్తాను అని చెప్తుంది.
కళ్యాణ్ దగ్గరకు వెళ్లిన కావ్య.. మరిదికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. ప్రతీ భార్యకు తన భర్త గొప్పగా ఉండాలని కోరుకుంటుంది అని చెప్తుంది. అలా అని నాకు నచ్చని , రాని పని చేయలేను కదా అంటాడు కళ్యాణ్.
మరో వైపు బెడ్ రూమ్ లో ఒంటరిగా కూర్చుంటుంది అనామిక. ఇంతలో రూమ్ లోకి వెళ్లిన కళ్యాణ్.. 'నా వల్ల నువ్వు బాదపడ్డావు సారీ అని చెప్తాడు. తన ప్లాన్ ఫెయిల్ అయిందని కోపంతో రగిలిపోతున్న అనామిక.. కళ్యాణ్ పై మళ్ళీ రెచ్చిపోతుంది. నాలుగు గోడల మధ్య అవమానించి.. ఇప్పుడు సారీ చెప్తున్నావా.. నీది ఇంత చీప్ క్యారెక్టర్ అనుకోలేదు అంటూ భర్తను అవమానిస్తుంది.
భార్య ప్రవర్తనకు చిరాకు కలిగిన కళ్యాణ్.. నీ బుద్ది మారే వరకు నీ మొహం కూడా చూడను.. ఒకప్పుడు నిన్ను చూస్తే ప్రేమ ఉండేది.. ఇప్పుడు అసహ్యం కలుగుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
తమ్ముడి కాపురం నిలబెట్టాలని నిర్ణయించుకున్న రాజ్.. అనామిక కోరిక మేరకు కళ్యాణ్ కు ఒక బ్రాంచ్ అప్పగిస్తున్నట్లు అగ్రిమెంట్ పేపర్స్ తెచ్చి ఇస్తాడు. దీంతో కళ్యాణ్ నా మనసు నీకు అర్థం కాలేదా అన్నయ్య అని బాధపడతాడు. మంచి ఛాన్స్ దొరికిందని భావించిన రుద్రాణి కళ్యాణ్ పేపర్స్ తీసుకోమని చెప్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: Mangalavaram Movie: టీవీలో ‘మంగళవారం’ హవా.. అదిరిపోయే TRP రేటింగ్