Brahmamudi Serial: కావ్య తన బావతో షికారుకు వెళ్లడంతో.. కోపంగా ఇంటికి వచ్చిన రాజ్ భార్య పై ఇందిరాదేవికి ఫిర్యాదు చేస్తాడు. కావ్య ఎక్కడికీ వెళ్ళలేదు.. తన బావతో మన ఇంటికే వచ్చింది.. లోపల అందరు కలిసి భోజనం చేస్తున్నారు అని రాజ్ కు పెద్ద షాకిస్తుంది. కావ్య బావ ఏకంగా ఇంట్లోకే వచ్చాడని తెలియడంతో కోపంతో రగిలిపోతాడు.
భార్య పై రాజ్ జెలసీ గమనించిన ఇందిరాదేవి.. ప్లాన్ బాగానే వర్క్ అవుట్ అవుతుంది. భార్య పరాయి వ్యక్తితో తిరగడం చూసి తట్టుకోలేకపోతున్నాడు .. త్వరలోనే కావ్య పై నీ ప్రేమ బయటపడుతుంది అని మనసులో అనుకుంటుంది.
కావ్య బావ ఇంట్లో అందరితో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. రాజ్ మాత్రం అతనిని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో స్వప్న.. బావ అమెరికా వెళ్లే వరకు ఎక్కడ ఉంటున్నావు అని అడుగుతుంది. హోటల్ లో స్టే చేస్తున్నాని చెప్తాడు. దీంతో ఇందిరాదేవి.. కావ్యకు బంధువు అంటే.. మాకు కూడా కావాల్సిన వాడివే.. బయట ఉండడం ఎందుకు.. నీకు నచ్చినన్ని రోజులు మా ఇంట్లోనే ఉండమని చెబుతుంది.
ఇందిరాదేవి ఇలా చెప్పగానే రాజ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఒక్క సారిగా షాక్ అవుతాడు. ఇటు కావ్య.. తన బావ మాత్రం ప్లాన్ వర్క్ అవుట్ అయిందని సంతోషపడతారు.
రాజ్ ఉడికించడానికి.. నేను ఇక్కడ ఉండడం అన్నయ్యకు ఇష్టం లేనట్లుగా ఉంది అంటూ వెటకారంగా మాట్లాడతాడు కావ్య బావ. చేసేదేమి లేక రాజ్ కూడా కావ్య బావ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాడు.
ఆ తర్వాత కావ్య, తన బావ ఇద్దరు.. రాజ్ ప్రేమను గెలుచుకోవడానికి వాళ్ళు ఎంచుకున్న దారి సరైనదేనా అంటూ ఇందిరాదేవితో అనుమానం వ్యక్తం చేస్తారు. తప్పు చేస్తున్న నా మనవాడే దైర్యంగా తిరుగుతున్నప్పుడు.. ఏ తప్పు చేయని మీరు ఎందుకు భయపడుతున్నారు అని ధైర్య చెబుతుంది. వీళ్ళ డ్రామా గురించి తెలుసుకున్న రాజ్ షాక్ అవుతాడు. నిజం తెలుసుకున్న రాజ్.. ఏం చేయనున్నాడు అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.