Brahmamudi Serial: రుద్రాణిని కోలుకోలేని దెబ్బ కొట్టిన స్వప్న.. కావ్య ప్లాన్ తో రాజ్ లో మొదలైన టెన్షన్

భర్త ప్రేమ కోసం కొత్త నాటకం మొదలు పెట్టబోతున్న కావ్య.. రాజ్ కు ఒక సర్ ప్రైజ్ ఇస్తానని చెప్తుంది. దీంతో సర్ ప్రైజ్ ఏంటా అని పిచ్చెక్కిపోతుంటాడు రాజ్. మరో వైపు చెల్లి పై నింద వేసిన అనామిక, రుద్రాణిలకు కోలుకోలేని షాక్ ఇస్తుంది స్వప్న. ఇలా సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Brahmamudi Serial: రుద్రాణిని కోలుకోలేని దెబ్బ కొట్టిన స్వప్న.. కావ్య ప్లాన్ తో రాజ్ లో మొదలైన టెన్షన్
New Update

Brahmamudi Serial: కావ్య పై దొంగతనం నింద పడడంతో.. చెల్లిని కాపాడుకోవాలని ఆలోచించిన స్వప్న.. ఆ డబ్బు తనతోనే ఉందని చెబుతుంది. కావ్య ఆఫీస్ కు వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్లకు ఏదైనా అవసరం ఉంటే ఇవ్వమని.. కావ్య నాకు 2 లక్షలు ఇచ్చింది అంటూ రుద్రాణి, అనామికలకు కోలుకోలేని ట్విస్ట్ ఇస్తుంది స్వప్న. publive-image

స్వప్న ఆ 2 లక్షలు తీసుకొచ్చి అపర్ణ చేతికి ఇస్తుంది. డబ్బులు కావ్య దొంగతనం చేయలేదని తేలిపోవడంతో.. కావ్య పై నిందలు వేసిన ధాన్యలక్ష్మీ, రుద్రాణీలను కడిగిపారేస్తుంది అపర్ణ. డబ్బులు తిరిగి వచ్చాయి.. మరీ మీ మాటలు ఎలా వెనక్కి తీసుకుంటారు అంటూ ఇద్దరికీ గడ్డి పెడుతుంది అపర్ణ.

publive-image

మరో వైపు చెల్లిని కాపాడడానికి స్వప్నకు అంత డబ్బు ఎలా వచ్చిందని రుద్రాణి, రాహుల్ ఆలోచిస్తూ ఉంటారు. ఇక రుద్రాణి ఒక సారి తన లాకర్ ఓపెన్ చేసి చూడగానే తాను దాచుకున్న 5 లక్షలు కనిపించవు. దీంతో సీన్ మొత్తం అర్థమైన రుద్రాణి.. చెల్లిని కాపాడుకోవడానికి స్వప్న నా డబ్బులు కాజేసింది అంటూ మనసులో కుళ్ళుకుంటుంది రుద్రాణి.

publive-image

ఇంతలో అక్కడికి వచ్చిన స్వప్న.. నా చెల్లిని దొంగను చేయాలనీ చూసారు. అందుకే మీ డబ్బులే తీసి ఇచ్చాను.. మీకు నేనే కరెక్ట్ అంటూ రాహుల్, రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది. మరి మిగతా మూడు లక్షలు ఏం చేశావని రుద్రాణి అడగగా.. షాపింగ్ కోసం ఖర్చు పెట్టానని షాకిస్తుంది స్వప్న. దీంతో దాచుకున్న డబ్బులన్నీ పోయేసరికి ఏడ్చినంత పని చేస్తుంది రుద్రాణి.

publive-image

ఇటు రాజ్ గురించి నిజం తెలుసుకున్న ఇందిరాదేవి కావాలనే .. కావ్య ఎందుకో డల్ గా కనిపిస్తుంది ఏమైందని రాజ్ ను అడుగుతుంది. దీంతో నానమ్మకు డౌట్ వచ్చిన అని ఫీలైన రాజ్.. ఇందిరాదేవి ముందు కావ్యతో క్లోజ్ గా ఉన్నట్లు నటిస్తాడు.

publive-image

కావ్య పై దొంగతనం నింద పడకుండా కాపాడినందుకు స్వప్నకు థాంక్స్ చెప్తుంది కావ్య. నువ్వు చాలా మారిపోయావు అక్క అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా భర్త, అత్త నా పై నింద వేసినప్పుడు..నవ్వు నా పక్కన ఉన్నావు. ఇక నుంచి నీకు సపోర్ట్ గా నేను ఉంటాను అని కావ్యకు దైర్యం చెప్తుంది స్వప్న.

publive-image

కావ్య రూమ్ లోకి వస్తుంది అని గమనించిన రాజ్.. కావాలనే శ్వేతతో మాట్లాడుతున్నట్లు నటిస్తాడు. ఒక ప్లాన్ తో తిరిగి ఇంటికి వచ్చిన కావ్య.. రాజ్ ఎంత రెచ్చగొట్టిన సైలెంట్ గా ఉంటుంది. మీకు కావాల్సినంత సేపు మాట్లాడుకోండి నాకు ప్రాబ్లమేమి లేదని రాజ్ కు రివర్స్ కౌంటర్ ఇస్తుంది.

publive-image

కావ్య ఇలా చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఫీల్ అవుతుంది అనుకుంటే ఇలా చేస్తుంది ఏంటి అని ఆలోచనలో పడతాడు. ఇంతలో కావ్య మీకు రేపు ఒక సర్ ప్రైజ్  ఇవ్వబోతున్నాని రాజ్ తో చెబుతుంది. ఇక రాత్రంతా సర్ ప్రైజ్ఏంటని కావ్య బుర్ర తింటాడు రాజ్. అసలు కావ్య ఏం చేయబోతుందా..? అని పిచ్చెక్కిపోతుంటాడు రాజ్. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Paayal Raajput Video: బాటిల్ తో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్.. వైరలవుతున్న వీడియో

#brahmamudi-serial-today-episode
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe