Bjp district Incharges: బీజేపీ జిల్లా ఇన్‌ ఛార్జ్‌లను మార్చే యోచనలో అధిష్టానం!

రాష్ట్రంలోని ప్రధాన పార్టీ అయినా బీజేపీలో(Bjp) ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి మరో అనూహ్య నిర్ణయంతో బీజేపీ నేతల ముందుకు వచ్చింది

Bjp district Incharges: బీజేపీ జిల్లా ఇన్‌ ఛార్జ్‌లను మార్చే యోచనలో అధిష్టానం!
New Update

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార పక్షం వారు, విపక్షాల వారు తమ ప్రణాళికలను ఇతర పార్టీల వారికి అందని విధంగా రచిస్తున్నారు. కొందరు అమలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీ అయినా బీజేపీలో(Bjp) ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈ క్రమంలోనే మరోసారి మరో అనూహ్య నిర్ణయంతో బీజేపీ నేతల ముందుకు వచ్చింది. బీజేపీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేని జిల్లా ఇన్‌ ఛార్జ్‌ లను మార్చుతున్నట్లు గురువారం ప్రకటించింది. అలాగే ఇప్పుడు ఎవరైతే జిల్లా ఇన్‌ ఛార్జ్ లుగా ఉన్నారో..వారిలో కొందరు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ ముఖ్య నేతల వద్దకు సమాచారం వెళ్లడంతో వారిని కూడా ఇన్‌ ఛార్జ్‌ లుగా తొలగించాలని నిర్నయించుకున్నట్లు పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఎన్నికలు సమీపిస్తుండడంతో అసెంబ్లీ ఇన్‌ఛార్జీలను కూడా మార్చనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా పలు జిల్లాల అధ్యక్షులను మార్చేసేటట్లుగా ప్రణాళికలు సిద్దం అయ్యాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఖాళీగా ఉన్న పోస్టులను ఎన్నికల ముందు పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి కొందరు నేతలను బహిష్కరించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో వాటిని ఎలాగైనా భర్తీ చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలు కసరత్తులు మొదలు పెట్టారు.

గత కొన్ని నెలల క్రితం అసెంబ్లీ ఇన్‌ ఛార్జ్‌ లను నియమించిన తరువాత వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులని చెప్పడంతో రాష్ట్ర రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు మొదలు అయ్యాయి. ఆ నిర్ణయాన్ని చాలా మంది తప్పు పట్టారు. దీంతో వెనక్కి తగ్గిన బీజేపీ అధిష్టానం. రాష్ట్ర రాజకీయాల్లో నేతలందరూ కూడా చురుకుగా పాల్గొంటూ..కష్టపడి పని చేయాలని సూచనలు జారీ చేసింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe