Bigg Boss 7 Promo: "నీ సొంతంగా ఒక్కసారైనా నామినేషన్ వేశావా"..? ప్రశాంత్ పై రెచ్చిపోయిన అర్జున్..!

బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ఇక అర్జున్ - ప్రశాంత్.. రతిక, శోభ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఎప్పుడు కూల్ గా ఉండే అర్జున్ ఈ నామినేషన్ లో తన విశ్వరూపాన్ని చూపించాడు.

Bigg Boss 7 Promo: "నీ సొంతంగా ఒక్కసారైనా నామినేషన్ వేశావా"..? ప్రశాంత్ పై రెచ్చిపోయిన అర్జున్..!
New Update

Bigg Boss 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా విడుదలైన ప్రోమోలో ఇంటి సభ్యులంతా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. నిన్నటి వరకు ఫ్యామిలీ మెంబర్స్ రాకతో హ్యాపీగా, సాఫీగా సాగిన బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ రచ్చ మొదలైంది. ఈ ప్రోమోలో అర్జున్, ప్రశాంత్ ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇన్ని రోజులు కామ్, కంపోస్ గా ఉన్న అర్జున్ ఈ రోజు జరిగిన నామినేషన్ లో కోపంతో రెచ్చిపోయాడు. ఇక నామినేషన్ స్టార్ట్ అయ్యే ముందే.. శివాజీ.. రతికకు మంచి సలహాలు ఇస్తూ కనిపించాడు ప్రోమోలో. "నామినేషన్ లో నీ పాయింట్ క్లారిటీగా చెప్పు.. అవతలి వాళ్ళు డిఫెండ్ చేసుకునేటప్పుడు తిరిగి నిన్ను ప్రశ్నించే అవకాశం ఇవ్వకు.. నీ టాలెంట్ చూపించు" అని హిత బోధ చేశాడు.

publive-image

శోభ VS రతిక

నామినేషన్ ప్రక్రియ మొదలైంది. రతిక వెళ్లి శోభను నామినేట్ చేసింది. శోభను నామినేట్ చేస్తూ రతిక చెప్పిన రీజన్.. "కెప్టెన్ అయిన తర్వాత.. నువ్వు ఎంత వరకు 100% ఇచ్చావని అనుకుంటున్నావు"..? అనగానే శోభ 100 కాదు 200% ఇచ్చాను అని రతికతో వాదించింది. దానికి రతిక "ఫిగర్స్ లో చెబితే సరిపోదు.. ఏం చేశావో.. అది చెప్పు.. కెప్టెన్ అంటే ఊరికే బ్యాడ్జ్ పెట్టుకోవడం కాదు" అని శోభతో ఆర్గుమెంట్ స్టార్ట్ చేసింది. ఇక శోభ "కెప్టెన్ గా నేను ఏం చేశానో నీకు చెప్పాల్సిన అవసరం లేదని " రతికకు కౌంటర్ ఇచ్చింది.

publive-image

అర్జున్ కూడా శోభను నామినేట్ చేస్తూ.. "కెప్టెన్ అయిన తర్వాత.. ఒక్కసారైనా కిచన్ లోకి వచ్చావా..? నువ్వు VIP రూమ్ దాటి వచ్చావా..?" అని ప్రశ్నించాడు. దానికి శోభ "లేదు అక్కడే తిని, అక్కడే పడుకున్నాను" అంటూ వెటకారంగా సమాధానం చెప్పింది. దాంతో అర్జున్ "ఈ తింగరి సమాధానాలే వద్దు" అని కౌంటర్ ఇచ్చాడు.

publive-image

నీ సొంతంగా ఒక్కసారైనా నామినేషన్ వేశావా..? 

ఆ తర్వాత అర్జున్, ప్రశాంత్ ఇద్దరి మధ్య పెద్ద వాదన జరిగింది. ఇక అర్జున్ గత వారాల్లో ఎప్పుడు లేనట్లుగా.. ఈ వారం నామినేషన్స్ లో కోపంతో ఊగిపోయాడు. అర్జున్ ప్రశాంత్ ను నామినేట్ చేశాడు. ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ.. "నీ సొంతంగా ఒక్కసారైనా నామినేట్ చేశావా..?  నీకు గేమ్స్ ఎలా ఆడాలని శివాజీ చెప్పట్లేదు కదా.. అలాగే నీ సొంత ఆలోచనతో నామినేషన్ చేయాలి" అంటూ ప్రశాంత్ పై గట్టి గట్టిగా అరిచాడు. ఇక ప్రశాంత్ కూడా ఏ మాత్రం తగ్గలేదు.. "నేను సొంతగానే ఉన్నాను.. నన్ను నేను ఎప్పుడు కోల్పోలేదు" అంటూ గట్టిగా వాదించాడు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: “అమర్.. ఎవ్వరికీ భయపడకు.. తిప్పరా మీసం”.. మానస్ మాస్ డైలాగ్ ..!

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe