Bigg Boss 7 Telugu: తేజ ఎలిమినేటెడ్..! శివాజీకి ఊహించని ట్విస్ట్..!

బిగ్ బాస్ సీజన్ 7 ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో మొదటి నుంచి శోభ ఎలిమినేటెడ్ అనే బజ్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది. కానీ ప్రస్తుతం ఊహించని విధంగా బిగ్ బాస్ ఇంటి నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

Bigg Boss 7 Telugu: తేజ ఎలిమినేటెడ్..! శివాజీకి ఊహించని ట్విస్ట్..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే.. బిగ్ బాస్ ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యేది ఎవరని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అమర్, తేజ, శోభ, యావర్, రతిక, అర్జున్, ప్రియాంక, భోలే ఈ ఎనిమిది మందిలో వారం మొదటి నుంచి శోభ ఎలిమినేట్ అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం తేజ ఎలిమినేటెడ్ అనే బజ్ గట్టిగా వినిపిస్తుంది. చివరి ఎలిమినేషన్ ప్రాసెస్ రతిక, తేజ ఇద్దరి మధ్య జరిగినట్లుగా.. ఈ ప్రక్రియలో తేజ ఎలిమినేట్ అయ్యాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది

నిజంగానే తేజ ఎలిమినేట్ అయితే ఇంటి సభ్యులకు పెద్ద షాకనే చెప్పొచ్చు. మొదటి వారం నుంచి తేజ తన కామెడీతో ప్రేక్షకులతో పాటు ఇంటి సభ్యులను కూడా  బాగా ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాడు. కానీ నామినేషన్స్ లో తేజ చెప్పే సిల్లీ రీజన్స్ తన ఆటకు మేజర్ మైనస్ అయినట్లుగా తెలుస్తుంది. 'మొహం మీద నీళ్లు పోశావని', 'పాజిటివ్ వైబ్స్, నెగిటివ్ వైబ్స్' అంటూ సిల్లీగా నామినేట్ చేయడం కూడా తన ఎలిమినేషన్ కు కారణం అయ్యే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.

గత వారంలో సందీప్ కు వేసిన సిల్లీ నామినేషన్ వల్ల తను వెళ్లిపోయాడని తెలిసి కూడా.. ఈ వారం మళ్ళీ అదే రీజన్ చెబుతూ.. అర్జున్ ని నామినేట్ చేశాడు. ఇది చూసిన జనాల్లో .. తేజకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనే నెగిటివ్ ఫీలింగ్ కూడా తన ఎలిమినేషన్ కు కారణం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇక ఈ వారం నామినేషన్స్ లో శివాజీ.. సేమ్ తేజ చెప్పే రీజనే చెబుతూ తేజను నామినేట్ చేశాడు. ' ఒకసారి జనాల్లోకి వెళితే నీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పాడు. కానీ తర్వాత.. నువ్వేమి ఎలిమినేట్ అవ్వవులే అంటూ దైర్యం కూడా ఇచ్చారు.  ఒకవేళ ఈ వారం తేజ ఎలిమినేట్ అయితే తాను తీసుకున్న గొయ్యిలో తాను పడినట్లే అన్నట్లుగా ప్రేక్షకులు భావిస్తున్నారు.

Also Read: Also Read: Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ స్టేజ్ పై ‘దాయి దాయి దామ్మ’ పాటకు స్టెప్పులేసిన రాఘవ లారెన్స్..!

#bigg-boss-7 #bigg-boss-7-latest-episode #bigg-boss-7-telugu #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe