Bigg Boss 7 Telugu: శోభ ఎలిమినేటెడ్..? అమర్ కు బిగ్ బాస్ సర్ ప్రైజ్..!

బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే.. ఎవరు ఎలిమినేట్ అవుతారా.. అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక ఈ వారం శోభతో పాటు ఊహించని విధంగా తేజ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

Bigg Boss 7 Telugu:  శోభ ఎలిమినేటెడ్..? అమర్ కు బిగ్ బాస్ సర్ ప్రైజ్..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. ఈ సీజన్ లో బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ నుంచే ఆటను చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేస్తూ వచ్చారు. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ కాస్త డిఫరెంట్ అనే చెప్పొచ్చు. ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఆడియన్స్ అంచనాల ప్రకారమే జరుగుతూ వస్తుంది. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న సభ్యులు తేజ, రతిక, శోభ, అర్జున్, యావర్, భోలే, ప్రియాంక, అమర్. ఈ ఎనిమిది సభ్యుల్లో ఎలిమినేషన్ లిస్ట్ లో రతిక , తేజ, శోభ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వీళ్ళ ముగ్గురిలో శోభ ఎలిమినేటెడ్ అనే టాక్ మాత్రం సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది.

శోభ ఎలిమినేట్ అవ్వడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి.. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో శోభ చివరి వరకు వెళ్ళడం.. దాంతో పాటు ప్రేక్షకుల్లో.. శోభ గట్టిగా అరుస్తుంది.. చెప్పింది అర్థం చేసుకోదు అనే నెగిటివ్ ఒపీనియన్ కూడా ఆమె ఎలిమినేషన్ కు కారణం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అంతే కాదు ఈ వారం శోభతో క్లోజ్ గా ఉండే అమర్, తేజ, ప్రియాంక, అర్జున్ కూడా నామినేషన్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓట్స్.. శోభకు వేసే అవకాశం కూడా లేదు. అందుకని శోభ ఓటింగ్ తగ్గే అవకాశం ఉంది. దాంతో శోభ ఎలిమినేట్ అయ్యే అవకాశం  ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు.

publive-image

శోభతో పాటు తేజ, రతిక కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ.. రతిక రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రశాంత్, శివాజీ తో క్లోజ్ గా ఉంటూ కనిపిస్తుంది. ఇక ఈ వారం శివాజీ, ప్రశాంత్ ఇద్దరు నామినేషన్ లో లేరు.. అందుకని వీళ్లిద్దరి ఓట్స్ రతికకు పడే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని రతిక ఎలిమినేషన్ ఛాన్సెస్ కూడా తక్కువని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

ఇక ఎలిమినేషన్ లిస్ట్ లో తేజ పేరు కూడా వినిపిస్తుంది. ఇంతకముందు వారం నామినేషన్ లో చెప్పినట్లే.. ఈ వారం కూడా తేజ సిల్లీ రీజన్స్ చెబుతూ  అర్జున్ ని నామినేట్ చేశాడు. అలా సిల్లీ రీజన్స్ చెప్పడం.. తేజ పై ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయం మార్చే  అవకాశం ఉంది. అందుకని ఊహించని విధంగా తేజ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. కానీ వీళ్ళ ముగ్గురిలో శోభ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు ప్రేక్షకులు అనుకుంటున్నారు.

publive-image

శోభ కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే.  ఒకవేళ శోభ ఎలిమినేట్ అయితే.. శోభ కోసం కెప్టెన్సీ టాస్క్ ఆడిన అమర్ ను బిగ్ బాస్ కెప్టెన్ చేసే అవకాశం ఉంది. ఇలా చేస్తే అమర్ కు బంపర్ ఆఫర్ వచ్చేనట్లే. కెప్టెన్సీ తో పాటు ఒక వారం సేవ్ కూడా అవ్వచ్చు.

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe