Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్ పై శోభ బాయ్ ఫ్రెండ్.. ఎవరో తెలిస్తే షాకవుతారు..!

బిగ్ బాస్ సీజన్ 7.. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా తాజాగా విడుదలైన ప్రోమోలో.. జబర్దస్త్ హైపర్ ఆది బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. హైపర్ ఆది తన కామెడీతో ఇంటి సభ్యులను రోస్ట్ చేస్తూ.. అందరినీ బాగా ఎంటర్ టైన్ చేశాడు.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్ పై శోభ బాయ్ ఫ్రెండ్.. ఎవరో తెలిస్తే షాకవుతారు..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా బిగ్ బాస్ స్టేజ్ పై సెలెబ్రెటీస్ తో ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేశారు. ఆటలు, పాటలు, డాన్సులతో బిగ్ బాస్ స్టేజ్ అంతా సందడిగా మారింది. తాజాగా విడుదలైన ప్రోమోలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీల, వైష్ణవ్  తేజ్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. శ్రీలీల, వైష్ణవ్  కాంబోలో రాబోతున్న 'ఆదికేశవ' గురించి మాట్లాడారు నాగార్జున.

publive-image

స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా.. జబర్దస్త్ హైపర్ ఆది స్టేజ్ పైకి వచ్చాడు. ఆది స్టేజ్ పైకి రాగానే .. "మన్మధుడు సినిమా ఫస్ట్ హాఫ్ లో నాగార్జున గారికి లేడీస్ అంటే పడదు.. అలాగే ఈ సీజన్ లో కూడా ఫస్ట్ హాఫ్ లో లేడీస్ అందరు ఎలిమినేట్ అయ్యారని" ఫన్నీగా మాట్లాడాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరితో మాట్లాడాడు. ఇక ప్రశాంత్ తో మాట్లాడుతూ.. "మొక్క పై ఫోకస్  చేయకుండా.. రతిక అక్క మీద ఫోకస్  చేస్తే మా అందరికి భయమేసింది" అంటూ కామెడీ చేశాడు.

publive-image

ఇక నాగార్జునతో మాట్లాడుతూ.. సార్.. నాకు అమర్ ను చూడగానే ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది అంటూ.. "నువ్వు నీకోసం పుట్టలేదురా.. శోభను కెప్టెన్ చేయడానికి పుట్టావు..తిప్పారా మీసం " అని పంచ్ డైలాగ్ వేసి అందరిని నవ్వించాడు. ఆ తర్వాత శోభతో మాట్లాడుతూ.. "ఇప్పటికీ.. తేజ.. నిద్రలో కూడా నేను ఏమి చేయలేదు శోభ.. నా తప్పేమీ లేదు.. నాకొద్దు టాటూ.. వేయండి ఓటు అని కలవరిస్తున్నాడు" అంటూ శోభను ఆట పట్టించాడు. ఇక హైపర్ ఆది తన తన కామెడీతో సభ్యులందరినీ బాగానే రోస్ట్ చేసి.. అందరిని నవ్వించాడు.

publive-image

ప్రోమో చివరిలో శోభ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ నాన్న ఇద్దరు స్టేజ్ పైకి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ పైకి రాగానే ఎమోషనల్ అయ్యింది శోభ. ఇక నాగార్జున మాట్లాడుతూ.. "మూడేళ్లు దాచిన సీక్రెట్.. మేము బయటకు తెచ్చాము" అని శోభను ఆట పట్టించారు నాగార్జున. శోభ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతూ.. గేమ్ బాగా ఆడుతున్నావు.. ఇంకా బాగా ఆడాలని చెప్పాడు. శోభ బాయ్ ఫ్రెండ్ మరెవరో కాదు కార్తీక దీపం సీరియల్ లో నటించిన నిరూపమ్ కు తమ్ముడిగా నటించిన యశ్వంత్.

publive-image

Also Read: Bigg Boss 7: అర్జున్ కు డైరెక్టర్ బుచ్చిబాబు ఆఫర్.. రామ్ చరణ్ మూవీలో సూపర్ రోల్..!

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe