Bigg Boss 7 Telugu: గౌతమ్, సందీప్ ఎలిమినేటెడ్..? ఊహించని ట్విస్ట్..!

బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్స్ లో ఉన్న సభ్యులు భోలే, అమర్, సందీప్, ప్రియాంక, శోభా, అశ్విని, గౌతమ్, శివాజీ వీళ్ళ ఎనిమిది మందిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనే అంశంపై సోషల్ మీడియాలో పలు చర్చలు జరుగుతున్నాయి. షాకింగ్ గా సందీప్ ఎలిమినేట్ అయ్యాడన్న వార్త సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

Bigg Boss 7 Telugu: గౌతమ్, సందీప్ ఎలిమినేటెడ్..? ఊహించని ట్విస్ట్..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ చాలా ఆసక్తిగా కొనసాగుతుంది. ఉల్టా పుల్టా అనే కొత్త కాన్సెప్ట్ తో స్టార్ట్ అయిన ఈ సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. వీకెండ్ వచ్చిందంటే బిగ్ బాస్ ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం పై సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సభ్యులు భోలే, అమర్, సందీప్, ప్రియాంక, శోభ, అశ్విని, గౌతమ్, శివాజీ. ఈ ఎనిమిది మందిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న అంశంపై సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.

ఈ వారం అనూహ్యంగా ఈ ఎనిమిది సభ్యుల్లో టాప్ కంటెస్టెంట్ గా భావించిన సందీప్ ఎలిమినేట్ అవుతాడని సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరలవుతుంది. సందీప్ ఎలిమినేట్ అవ్వడానికి ప్రేక్షకులు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. సందీప్ గత 6 వారాల నుంచి మొదటి సారి నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇది సందీప్ ఎలిమినేషన్ కి కారణమయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే గత సీజన్ లో కూడా అలీ రేజ విషయంలో ఇదే జరిగింది. మొదటి నుంచి నామినేషన్ లో ఉంటున్నవాళ్లకు ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడి పోతుంది. అందుకని జనాలు వాళ్లకు ఓట్లు వేయడానికి అలవాటు పడిపోతారు. ఇప్పుడు మొదటి సారి నామినేషన్స్ లో ఉన్న సభ్యులకు ఓట్లు వేయడంలో అంతగా దృష్టి పెట్టారు. దాని వల్ల ఫస్ట్ టైం నామినేషన్ లోకి వచ్చిన సందీప్ ఎలిమినేట్ అవుతాడని ప్రేక్షకులు భావిస్తున్నారు.

publive-image

ఇక మిగిలిన సభ్యుల్లో శివాజీ, అమర్, గౌతమ్, భోలే ఆన్లైన్ పోల్స్ ప్రకారం ఓటింగ్ లో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. శోభ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ, ఈ వారం శోభ తన గొడవలు, ఆర్గుమెంట్స్ తో బాగానే స్క్రీన్ స్పేస్ పొందుతోంది. ఈ వారం కొంత నెగిటివిటీ ఉన్నప్పటికీ టాస్కుల్లో బాగా ఆడి కంటెండర్ గా నిలిచింది. అంతే కాకుండా ఇది వరకు పలు సార్లు నామినేషన్స్ కి వెళ్లి సేవ్ అయ్యి వచ్చింది. కాబట్టి తనకు ఓట్లు పడే అవకాశం ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

publive-image

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ తో రతిక ప్యాచప్.. ఆ మాటలకు ఏడ్చేసిన ప్రశాంత్..!

#bigg-boss-7-telugu #bigg-boss-7-latest-episode #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe