Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7.. ఈ రోజు ఎపిసోడ్ కు సంబంధించి లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్స్ ఇన్ని రోజులుగా ఫ్యామిలీస్ కు దూరంగా.. కనీసం ఫోన్స్ కూడా లేకుండా ఉంటారు. ఇక ఇంటి సభ్యులు ఎంతగానో ఎదురుచూసే ఫ్యామిలీ వీక్ వచ్చేసింది. ఫ్యామిలీ వీక్ సందర్భంగా ఇంటి సభ్యుల కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమోలో అశ్విని కోసం వాళ్ళ మదర్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. అమ్మ వచ్చిందనే సంతోషంలో అశ్విని వాళ్ళ అమ్మను పట్టుకొని ఏడ్చేసింది.
ఇక అశ్విని ఇంటి సభ్యులందరికి వాళ్ళ అమ్మను పరిచయం చేసింది. అశ్విని మదర్.. తన కూతురిని పట్టుకొని ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత అశ్వినితో మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి ఎవ్వరు.. ఏమన్నా సరే అస్సలు ఏడవకు అంటూ దైర్యం చెప్పింది. ఇక అశ్విని ఏడుస్తూ.. ఒక్కోసారి ఇవ్వన్నీ వదిలేసి ఇంటికి రావాలని అనిపిస్తుంది అమ్మ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత అశ్విని వాళ్ళ అమ్మ.. అశ్విని గేమ్ గురించి కొన్ని హింట్స్ ఇచ్చింది. నా అని అనుకున్న వాళ్ళు.. నీ వాళ్ళు కాదని చెప్పింది. వాళ్ళ అమ్మ చెప్పింది ఎవరి గురించి అనేది అశ్వినికి అర్ధమయ్యే ఉంటుంది.
అమ్మ వచ్చిన ఆనందంలో అశ్విని.. వాళ్ళ అమ్మ ఒడిలో పడుకొని ఉండగా.. బిగ్ బాస్ అశ్విని మదర్ తో.. మీరు ఇంటి నుంచి వెళ్లే సమయం ఆసన్నమైందని తెలిపారు. ఇక అశ్విని అమ్మ .. నన్ను వదిపెట్టి వెళ్ళకు అంటూ ఎమోషనల్ అయినట్లు ప్రోమోలో కనిపించింది.
Also Read: Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లో ‘శ్రీమంతం’ వేడుకలు.. ఎమోషనల్ ప్రోమో..!