Bigg Boss 7 Telugu Promo: నువ్వు అరిస్తే.. నేను అరుస్తా.. అయితే అరువు..!

బిగ్ బాస్ సీజన్ 7.. నామినేషన్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో రాజమాతలైన రతిక, ప్రియాంక, అశ్విని మీ ముగ్గురులో.. ఏకాభిప్రాయంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నేరుగా నామినేట్ అయ్యేది.. ఎవరో కారణాలతో చెప్పాలని బిగ్ బాస్ షాకిచ్చారు.

Bigg Boss 7 Telugu Promo: నువ్వు అరిస్తే.. నేను అరుస్తా.. అయితే అరువు..!
New Update

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7.. నామినేషన్ ప్రోమో వచ్చేసింది. ప్రోమో చూస్తుంటే ఈరోజు నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తిగా ఉండబోతున్నట్లు కనిపించింది. ఈ నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య గట్టిగానే వాదనలు జరిగాయి. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో రాజమాతలుగా వ్యవహరించిన అశ్విని, ప్రియాంక, శోభ, రతిక ముగ్గురిలో నుంచి ఒకరు నేరుగా నామినేట్ అవుతారని పెద్ద షాక్ ఇచ్చారు బిగ్ బాస్.

publive-image

'శోభ కెప్టెన్ అయినందున.. ఈ వారం నామినేషన్ లో ఉండదు. కావున మీ ముగ్గురులో.. ఏకాభిప్రాయంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నేరుగా నామినేట్ అయ్యేది.. ఎవరో కారణాలతో చెప్పాలని బిగ్ బాస్ తెలిపారు. ఇక అశ్విని, ప్రియాంక, రతిక వాళ్ళు నామినేట్ చేసే వారికి తగిన కారణాలు చెప్పారు.

publive-image

ముందుగా వచ్చిన ప్రియాంక.. రతికను నామినేట్ చేసింది. దానికి ప్రియాంక చెప్పిన రీజన్.. 'ఈ వీక్ చూడు నా గేమ్ ఏంటో చూపిస్తా' అన్నావు కదా.. కానీ నీ గేమ్ ఎక్కడ కనిపించలేదని చెప్పింది. ఈ విషయంలో రతిక, ప్రియాంక మధ్య వాదన జరిగింది.

publive-image

ఆ తర్వాత వచ్చిన శోభ కూడా రతికను నామినేట్ చేస్తూ.. ఈ ఇంట్లో అందరి కంటే నువ్వు చాలా వీక్ కంటెస్టెంట్ అనిపిస్తుందని చెప్పింది. దానికి రతిక వాదిస్తూ.. నేను కాదు.. నువ్వే వీక్ అంటూ శోభతో వాదన మొదలు పెట్టింది. ఇక ఈ విషయంలో రెచ్చిపోయిన శోభ.. నేను వీక్ కంటెస్టెంట్ అయితే 10 వారాలు ఉండను కదా.. అంటూ రతికకు కౌంటర్ ఇచ్చింది.

publive-image

ఈ ప్రక్రియలో ప్రియాంక, అశ్విని ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇద్దరు ఒకరి పై ఒకరు గట్టి గట్టిగా అరుచుకున్నారు. అశ్విని చెప్పిన మాటలు నచ్చని ప్రియాంక.. నువ్వు ఏది పడితే అది మాట్లాడొచ్చా అని అశ్విని పై అరిచింది. దాంతో అశ్విని.. అరవకు నువ్వు అరిస్తే.. నేను కూడా అరుస్తా అంటూ ఇద్దరు గట్టిగా వాదించుకున్నారు.

publive-image

Also Read: Prabhas Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్.. ‘సలార్’ విడుదల కానట్లేనా..!

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe