Bigg Boss 7 Telugu: నీలో కెప్టెన్సీ  పవర్ కనిపించటం లేదు.. శోభ VS అశ్విని..!

బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ప్రోమోలో ఇంటి సభ్యులంతా కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. ప్రోమోలో చూపిన ప్రకారం అశ్విని, ప్రియాంక, ప్రశాంత్ ముగ్గురు కెప్టెన్సీ రేస్ నుంచి తొలగిపోయినట్లు కనిపించింది. ఈ టాస్క్ లో యావర్, ప్రియాంక మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగింది. మరి చివరికి ఈ టాస్క్ లో విన్ అయ్యేది ఎవరో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.

Bigg Boss 7 Telugu: నీలో కెప్టెన్సీ  పవర్ కనిపించటం లేదు.. శోభ VS అశ్విని..!
New Update

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు విడుదలైన ప్రోమోలో హౌస్ మేట్స్  అంతా కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ 'ఫ్లోట్ ఆర్ సింక్' ఇక ఈ టాస్క్ లో కెప్టెన్ అవ్వడానికి  అర్హత లేని వారికి తగిన కారణాలు చెప్పి వారిని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించాల్సి ఉంటుందని బిగ్ బాస్ తెలిపారు. ఇక ఈ ప్రక్రియలో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు.  ప్రోమోలో చూపిన  ప్రకారం అశ్విని, ప్రియాంక, ప్రశాంత్ ముగ్గురు  కెప్టెన్సీ రేస్ నుంచి తొలగిపోయినట్లు కనిపించింది.

publive-image

నీకు కెప్టెన్ అయ్యే పవర్ లేదు 

కెప్టెన్సీ కోసం జరుగుతున్న ఈ ప్రక్రియలో ముందుగా శోభ వచ్చి.. అశ్విని ఫోటోను స్విమ్మింగ్ పూల్ లో వేసి తనను కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించింది. దీనికి శోభ చెప్పిన రీజన్.. అశ్విని నీలో నాకు కెప్టెన్సీ  పవర్ కనిపించటం లేదు, 'యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ది కెప్టెన్' అంటూ చెబుతుంది. దాంతో అశ్విని నీకు.. నాలోని పవర్  ఇంకెప్పటికీ కనిపించదులే, నువ్వు నా ఫోటోని  పూల్ లో వేసే విధానం చూస్తుంటేనే తెలుస్తుంది నా పై ఎంత కోపం ఉందో అని అంటుంది అశ్విని.

నేను ఇక్కడికి సోలోగానే వచ్చాను 

ప్రియాంక.. నువ్వు అమర్ కు ఇంట్లో ఎవరితోనైన గొడవైన ప్రతిసారి మధ్యలో వస్తావు అది నాకు నచ్చలేదు అంటూ యావర్ ప్రియాంకను కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించాడు. దాంతో ప్రియాంక నేను అమర్ కోసం రాలేదు ఒక హౌస్ మేట్ గా నా ఒపీనియన్ చెప్పాను. నేను ఇక్కడికి సోలోగానే వచ్చాను, సోలోగానే ఆడతాను సోలోగానే వెళ్ళిపోతాను. నేను ఇక్కడికి ఎవరి కోసం రాలేదు అంటూ యావర్ పై కోపంగా వెళ్ళిపోయింది.  వీళ్లిద్దరి మధ్య ఆర్గుమెంట్ గట్టిగానే జరిగినట్లు కనిపిస్తుంది.

వీళ్ళిద్దరితో పాటు పూజ  ప్రశాంత్ ను కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించింది. అందరికి ఒక చాన్స్ రావాలి ప్రశాంత్ అని చెప్పి ప్రశాంత్ ఫోటోను పూల్ లో వేసింది దానికి ప్రశాంత్ ఒకసారి కెప్టెన్ అయితే మళ్ళీ అవ్వకూడదా అని పూజతో ఆర్గుమెంట్ చేసినట్లు కనిపించింది. చివరికి కెప్టెన్ అయ్యింది ఎవరో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.

#bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe