Thummala: బిగ్ బ్రేకింగ్: కారు దిగేస్తున్న తుమ్మల.. 6న కాంగ్రెస్ లోకి జంప్!

అసమ్మతినేతలు తమ సత్తా ఏంటో చూపించడానికి కారు దిగి వేరే పార్టీల కండువాలు కప్పుకోవడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే పాలేరు సీటు కోసం పట్టుబట్టిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అందరూ ఊహించినట్టుగానే త్వరలోనే బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం.సెప్టెంబర్ 6న ఆయన కాంగ్రెస్ లోకి చేరుతున్నట్టుగా సమాచారం..

Thummala: బిగ్ బ్రేకింగ్: కారు దిగేస్తున్న తుమ్మల.. 6న కాంగ్రెస్ లోకి జంప్!
New Update

Thummala into Congress Party: బీఆర్ఎస్ బాస్ విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్ తో ఆ పార్టీలో రేగిన అసమ్మతి సెగలు ఇప్పట్లో చల్లారేట్టుగా లేవు. అసమ్మతిని వెళ్లగక్కుతున్న నేతలు ఒక్కొక్కరుగా పక్కదారి పట్టే పనిలో పడ్డారు. టికెట్ ఇస్తారా లేక జంప్ చేయాలా అనే ధోరణితో ఉన్న నేతలు అధిష్టానం బుజ్జగింపులకు కూడా బెండ్ కావడం లేదు. ఇక నామినేటెడ్ పదవుల ఆశలు కూడా వారిపై వర్కౌట్ అవ్వడం లేదు.

మరోవైపు అసమ్మతి నేతలను గాలం వేయడానికి రెడీగా ఉన్న ప్రతిపక్షాలు మాత్రం వారి డిమాండ్ లకు సై అంటున్నాయి. దీంతో అసమ్మతినేతలు తమ సత్తా ఏంటో చూపించడానికి కారు దిగి వేరే పార్టీల కండువాలు కప్పుకోవడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే పాలేరు సీటు కోసం పట్టుబట్టిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అందరూ ఊహించినట్టుగానే త్వరలోనే బీఆర్ఎస్ (BRS) కు బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం.

త్వరలో బీఆర్ఎస్ కు గుడ్ బై..!

పాలేరు టికెట్ కోసం పట్టుబట్టిన తుమ్మల నాగేశ్వర్ రావు అసంతృప్తిని వీడడం లేదు. ఆయన్ని బుజ్జగించడానికి పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ దాదాపుగా విఫలమయ్యాయి. మూడ్రోజుల క్రితం గులాబీ బాస్.. ఎంపీ నామా నాగేశ్వర్ రావును హైదరాబాద్ లోని తుమ్మల ఇంటికి పంపారు. ఆయనకు నామినేటెడ్ పదవుల ఆఫర్లు ఇచ్చారు. అయితే తుమ్మల మాత్రం వాటికి నో అన్నారని సమాచారం. దీంతో ఆయన ఆ నెక్ట్ డేనే బలప్రదర్శనకు దిగారు. గచ్చిబౌలిలోని తన ఇంటి నుంచి ఖమ్మంకు భారీ కాన్వాయ్ తో బయల్దేరారు. తరువాత అక్కడికెళ్లి తన అనుచరగణంతో ఆత్మీయ సమ్మేళనం చేపట్టారు.

అయితే తన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు ఆయన్ని పాలేరు నుంచి పోటీ చేయాల్సిందేనని.. అదే విధంగా పార్టీ నుంచి బయటికి రావాలని ఒత్తిడి చేసినట్టుగా సమాచారం. తుమ్మలను కాంగ్రెస్ లోకి వెళ్లాల్సిందిగా వారు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. దీంతో తుమ్మల తనకు పాలేరు టికెట్ కావాల్సిందేనని అధిష్టానం ముందు డిమాండ్ పెట్టారు. కాని అందుకు సానుకూలంగా రిప్లే అటు నుంచి రాకపోవడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కాంగ్రెస్ బెటర్ ఆప్షన్ అని తుమ్మల భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి డేట్ ఫిక్స్..!

ఇక ఇలా ఉంటే..ఎన్నికలకు ఎక్కువ సమయంలో లేకపోవడంతో తుమ్మల పార్టీ మారే విషయంలో కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో తన పేరు లేకపోవడంతో ప్లాన్ బీగా కాంగ్రెస్ కు టచ్ వెళ్లిన ఆయన తన డిమాండ్స్ ను కాంగ్రెస్ నేతల ముందు పెట్టారు. పాలేరు నుంచే బరిలోకి దిగాలని ఫిక్స్ అయిన తుమ్మల అందుకు తగ్గ హామీని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో తుమ్మల రహస్యంగా మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తుమ్మల కాంగ్రెస్ పార్టీలోకి చేరే డేట్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. సెప్టెంబర్ 6న పార్టీ అగ్రనేతలను హైదరాబాద్ కు ఆహ్వానించి తుమ్మలను పార్టీలోకి తీసుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. దీంతో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రంగం దాదాపుగా రెడీ అయినట్టే.

మరోవైపు మైనంపల్లి కూడా కాంగ్రెస్ లోకి చేరుతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయనతో కూడా కాంగ్రెస్ పెద్దలు మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. ఆయనకు మల్కాజ్ గిరి నుంచి ఆయన తనయుడికి మెదక్ నుంచి టికెట్ కు కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా కూడా సమాచారం అందుతోంది. సో.. త్వరలోనే మైనంపల్లి కూడా కాంగ్రెస్ లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి కారు దిగుతున్న సీనియర్లు కాంగ్రెస్ వైపు చూస్తుండడంతో ఆ పార్టీలో జోష్ నెలకొంది.

అలర్ట్ అయిన బీఆర్ఎస్..!

ఇక ఎన్నికల బరిలో ఉంటానంటూ తుమ్మల తేల్చిచెప్పడంతో అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. తుమ్మల వ్యాఖ్యలతో సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలకు ప్రగతి భవన్ రావాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో పర్యటనలు రద్దు చేసుకుని హుటాహుటిన నేతలు హైదరాబాద్ బయలుదేరారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో నేడు సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక ఇలా ఉంటే..తుమ్మల బలప్రదర్శనలో కాంగ్రెస్ జెండాలు కనిపించడంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది.

Also Read: వెనక్కి తగ్గేదేలే అంటున్న మైనంపల్లి.. సంచలన నిర్ణయం! త్వరలోనే కాంగ్రెస్ లోకా..!!

#thummala-joins-congress-party #thummala-nageswara-rao #thummala-into-congress-party
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe