Singareni New CMD: సింగరేణిలో సీఎండీ శ్రీధర్ శకం ముగిసింది. సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ పదవీకాలం శనివారంతో ముగిసింది. 2015 నుంచి జనవరి 1వ తేదీ నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. శ్రీధర్ ను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి నూతన సీఎండీ గా డైరెక్టర్ ఫైనాన్స్ బలరాం(Director Finance Balaram)కు అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.
గత కొంత కాలంగా శ్రీధర్ పదవీ కాలం పొడిగింపు పై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. గత నెల 30న జరిగిన సింగరేణి వార్షిక సర్వసభ్య సమావేశం(Singareni Annual General Meeting)లో శ్రీధర్ పదవీ కాలం పొడిగింపుపై వ్యతిరేకంగా తమ శాఖ అండర్ సెక్రటరీ అల్కాశేఖర్ ఓటు వేశారని..ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాష్ట్ర సర్కార్ కు లేఖ రాసింది. డిసెంబర్ 8వ తేదీని ఈ లేఖ ఇంధన శాఖతోపాటు సింగరేణికి కూడా చేరింది. 8ఏళ్లుగా సింగరేణి సీఎండీ పోస్టులో ఉంటున్న శ్రీధర్ కు వర్చువల్ సీఎండీగా పేరుంది. రాష్ట్రమంతా సంచలనం స్రుష్టించిన కేసులు సింగరేణిలో చోటుచేసుకున్నా ఆయన క్షేత్రస్థాయికి వెళ్లరని..ఏ సమీక్ష అయినా సరే హైదరాబాద్ నుంచే చేస్తారన్న విమర్శలు ఉన్నాయి.
కాగా గతంలో సింగరేణి సీఎండీ(Singareni CMD)గా శ్రీధర్ కొనసాగింపుపై హైకోర్టులో రిట్ పిటిషన్ భారతీయ మజ్దూర్ బొగ్గుగని కార్మిక సంఘం(Mazdoor Coal Workers Union of India) రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కేంద్రం, కోల్ ఇండియా ఆదేశాలను గత ప్రభుత్వం ఖాతరు చేయలేదు. శ్రీధర్ ను ఎన్ఎండీసీ సీఎండీగా గతంలోనే పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెక్షన్ బోర్డు సిఫారసు చేసింది. డిసెంబర్ 31 2023తో సింగరేణి సీఎండీగా శ్రీధర్ పదవీకాలం ముగిసింది. మరోఏడాది సీఎండీగా శ్రీధర్ కొనసాగుతారని బొగ్గురంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఎట్టకేలకు నూతన సీఎండీ ఎంపిక వైపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. శ్రీధర్ ను రిలీవ్ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు విడుదల చేసింది. సింగరేణి సీఎండీగా అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను కూడా స్వీకరించారు శ్రీధర్. ఎన్నో అభియోగాలకు, అరోపణలకు, విమర్శలకు శ్రీధర్ కేంద్రంగా మారారు. ఈనేపథ్యంలో ఆయన పదవికాలం ముగియడంతో శ్రీధర్ ను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి నూతన సీఎండీ గా డైరెక్టర్ ఫైనాన్స్ బలరాంకు అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.
ఇది కూడా చదవండి : ‘ప్రజాపాలన’లో అధికారుల నిర్లక్ష్యం.. ఆ అప్లికేషన్ ఫాములన్నీ రిజెక్ట్?