author image

Trinath

By Trinath

వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతాయి. సెప్టెంబర్ 18న గణేష్ చతుర్థి సందర్భంగా వినాయకుడి గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోండి. బహిరంగ వినాయక చవితి ఉత్సవాలను బాలగంగాధర తిలక్ 1893లో ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో గణేష్ చతుర్థిని మొదటిసారిగా గ్రాండ్‌గా జరుపుకున్నారు.

By Trinath

విజయవాడలోని గుణదల, మాచవరం, క్రీస్తురాజపురం, విద్యాధరపురం లాంటి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు ఎక్కువ. వాస్తవానికి నగరంలో 30శాతం ప్రజలు కొండ భూభాగాల్లోనే నివసిస్తున్నారు. అయితే వీరికి రక్షణ లేదన్న విమర్శలున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

By Trinath

బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం 96శాతం డీప్‌ఫేక్ వీడియోలు అశ్లీలమైనవే! అటు చైల్డ్‌ పోర్న్‌ కంటెంట్‌ను ఏఐ టూల్స్ ద్వారా ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు, ఫొటోలను క్రియేట్ చేయడానికి మోడ్రన్‌ అల్గారిథమ్స్‌తో పాటు మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తారు.

By Trinath

ఫ్లాట్‌వార్మ్‌లు, కోరల్ రీఫ్ ఫిష్, స్లిప్పర్ లింపెట్స్, మూర్ ఈల్స్, చిలుక చేప, రాస్సెస్, క్లోన్ ఫిష్ లాంటివి వయసు పెరిగే కొద్దీ లింగాన్ని మర్చుకుంటాయి. పునరుత్పత్తి కోసం ఇలా మార్చుకునే సామర్థ్యం ఈ చేపలకు ఉంది. అనేక పగడపు దిబ్బల చేపలు కూడా లింగాన్ని మార్చుకోగలవు.

By Trinath

క్రయోప్రెజర్వేషన్ ప్రక్రియ ద్వారా చనిపోయిన వారిని బతికించవచ్చని అమెరికన్ కంపెనీ 'అల్కోర్' చెబుతోంది. ఈ కంపెనీ ఇప్పటికే 233 మృతదేహాలను భద్రపరిచింది. జెనరేటివ్ మెడిసిన్ టెక్నాలజీ ద్వారా చనిపోయిన వారిని బతికించేందుకు ఈ కంపెనీ ప్రయోగాలు చేస్తోంది.

By Trinath

అప్రెంటిస్ పోస్టుల కోసం ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. మొత్తం 1500 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జూలై 31 వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి దరఖాస్తు ఫీజ్‌ రూ. 500. అభ్యర్థి వయస్సు పరిమితి 20 -28 సంవత్సరాలు.

By Trinath

సిరియాపై ఇజ్రాయెల్‌ దాడులను ఆపడంలేదు. ఓవైపు గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం ఇటు సిరియాపైనా దాడులు కొనసాగిస్తోంది. డమాస్కస్‌లోని సైనిక ప్రదేశాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఒక సిరియన్ సైనికుడు మరణించాడు.

By Trinath

హమాస్‌ కమాండర్‌ను మట్టుబెట్టేందుకు దక్షిణ గాజాలోని ఖాన్ యునిస్‌పై ఇజ్రాయెల్ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. అయితే ఈ దాడుల్లో హమాస్‌ కమాండర్‌ చనిపోలేదు కానీ 90మంది సామాన్యులు మరణించారు. మరో 300మంది గాయపడ్డారు. 2023 అక్టోబర్ 7 నుంచి హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం జరుగుతోంది.

By Trinath

గర్భిణీల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌ పేరు 'ప్రధానమంత్రి మాతృ వందన యోజన'. చాలామందికి ఈ పథకంపై అవగాహన లేదు. 19ఏళ్లు దాటిన పేద గర్భిణీలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద గర్భిణీలకు రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తారు.

By Trinath

వాట్సాప్‌ త్వరలో ఒక కొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. వాట్సాప్‌ మెసేజీలను ఏ భాషలోకైనా ట్రాన్స్‌లేట్‌ చేసుకునే ఆప్షన్‌ను వాట్సాప్‌ కల్పించనుంది. ముందుగా ఇంగ్లీష్, హిందీ, అరబిక్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్ సహా కొన్ని భాషలకు సపోర్ట్‌ ఇచ్చేలా ఫీచర్‌ రానుంది. తర్వాత మిగిలిన భాషలకు కూడా ఈ ఫీచర్‌ సపోర్ట్ ఇస్తుంది.

Advertisment
తాజా కథనాలు