మాజీ లవర్ ను తలచుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ఎక్స్ లవర్ ను తలచుకుంటూ బాధపడుతున్నారా. ఈ క్రమంలో సోషల్ మీడియాలో స్వీట్ మెమోరీస్ పోస్ట్ చేసేందుకు టెంప్ట్ అవుతున్నారా. అయితే తనను మిస్ అవుతున్నామని, మళ్లీ తిరిగి కలవాలనుకుంటున్నట్లు భావిస్తూ కొటేషన్స్, స్టేటస్ పెడుతున్నావాళ్లు ఈ టిప్స్ తప్పకుండా ఫాలో కావాలంటున్నారు నిపుణులు.

New Update
మాజీ లవర్ ను తలచుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

ఈ సమాజంలో లవ్ లో ఫెయిల్ అయినవాళ్లు చాలామంది ఉంటారు. ఒక్కొక్కరూ ఒక్కో కారణంతో బ్రేకప్ చెప్పుకుంటుంటారు. మరికొంతమంది మాత్రం తమ స్వార్థం కోసం పార్ట్ నర్ కు రీజన్ చెప్పకుండానే దూరమవుతుంటారు. ఇలా తమ లవర్ తో విడిపోయిన వాళ్లు కొంతకాలానికి ఎక్స్ లవర్ తలచుకుంటూ బాధపడుతుంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు టెంప్ట్ అవుతుంటారు. తనను మిస్ అవుతున్నామని, మళ్లీ తిరిగి కలవాలనుకుంటున్నట్లు భావిస్తారు. గతంలో జరిగిన కొన్ని స్వీట్ మూమెంట్స్ ను గుర్తు చేస్తూ స్టేటస్ లు, కొటేషన్స్ షేర్ చేస్తుంటారు. అయితే ఈ ఎమోషన్స్ లేదంటే రిలేషన్‌షిప్‌ను డీల్ చేసేందుకు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత అపార్థం చేసుకునే అవకాశం ఉందంటున్నారు.

ఇది కూడా చదవండి: ఉసిరి జ్యూస్ తో ఇన్ని ప్రయోజనాలున్నాయా.. ఇవి తెలిస్తే తాగకుండా ఉండలేరు

నిజానికి ఇలాంటి చర్య మీకు మీరే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారని, వారిపై తీరని ఆశతో, అవసరాన్ని కలిగి ఉన్నారని సిగ్నల్స్ ఇస్తుంది. అలాగే మీరు ఇప్పటికీ తనతోనే అటాచ్‌ అయి ఉన్నారని, ఇంకా లైఫ్‌లో మూవ్ ఆన్ కాలేదనే ఈ క్వాలిటీస్ ఏ ఒక్కరికీ నచ్చకపోవచ్చు. కాబట్టి ఎక్స్‌ లవర్‌ను అలా వదిలేయడం మంచిది. లేదంటే మీరు తప్పు చేసినవారు అవుతారు. లేకపోతే ఇది మీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎక్స్ ఏం చేస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? అనే ధ్యాసతో మీ వర్క్‌పై కాన్సంట్రేట్ చేయలేరు. ఆ గాయం నుంచి బయటపడలేరు. మొత్తానికి మీకు మీరు టైమ్ కేటాయించుకోకుండా ఆ వ్యక్తి గురించే బాధపడుతుంటారు. మీ లైఫ్‌ను మరింత హ్యాపీగా మార్చే ఫ్రెష్ పాజిటిబిలిటీస్, ఇంట్రెస్ట్, హాబీస్ డిస్కవర్ చేసే ఆపర్చునిటీని కోల్పోతారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఇది మరింత ప్రమాదం. మీ భాగస్వామికీ ఈ విషయం తెలిస్తే జీవితాంతం మీ పట్ల నెగెటివ్ ఆలోచన ఉండే ఛాన్స్ ఉంటుంది.

publive-image

ఇదిలా ఉంటే.. మరికొంతమంది మాజీ ప్రియులను తమకంటే తక్కువ స్థాయిలో ఉండిపోయారని ఎగతాళి చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు. వాళ్లను జలస్, గిల్టీగా ఫీల్ చేసేందుకు నెగెటివ్ పోస్టులు పెడుతుంటారు. అయితే ఈ చర్య మీరు ఇతరులతో ఎలా ఇంటరాక్ట్ అవుతారనే విషయాన్ని పరోక్షంగా తెలుపుతుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫాలోవర్స్ నమ్మకం కోల్పోతారు. మిమ్మల్ని ఇమ్మెచ్యూర్‌గా భావిస్తారు. గౌరవం కొల్పోతారు. అందుకే ఎదురుదాడికి దిగకుండా మీరు గొప్ప వ్యక్తిలా ఆలోచిచండి. మాజీ ప్రియులు కుడా మనలాగే ఉన్నత స్థానానికి చేరుకునేలా ఆదర్శంగా నిలవండి. మీ పట్ల అసూయపడేలా కాకుండా మీ గురించి ఇతరులకు గొప్పగా చెప్పేలా చూసుకోండి.

Advertisment
తాజా కథనాలు