AP: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ హెచ్చరిక

వర్షాల పట్ల అరకులోయ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. పర్యాటక ప్రాంతాల వద్ద సెల్ఫీలు తీసుకునే పర్యాటకులు కూడా జాగ్రత్తగా ఉండాలని స్థానిక సీఐ సూచించారు. అరకు మార్గంలో గంజాయి రవాణా ఇంచుమించు అరికట్టగలిగామని తెలిపారు.

AP: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ హెచ్చరిక
New Update

Vishaka: వర్షాల పట్ల అరకులోయ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లో పొంగిపొర్లుతున్న వాగులను, గడ్డలను, దాటేందుకు ప్రజలు సాహసం చేయ్యెద్దని అరకు సీఐ సూచించారు. పర్యాటక ప్రాంతాల వద్ద సెల్ఫీలు తీసుకునే పర్యాటకులు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఇటీవల గడ్డలు దాటుతూ ప్రజలు ప్రమాదంలో పడుతున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయనీ, అత్యవసరం అయితే గాని గ్రామాల నుండి గడ్డలు దాటి పట్టణాలకు రావవద్దని ఆయన కోరారు. అరకు మార్గంలో గంజాయి రవాణా ఇంచుమించు అరికట్టగలిగామని సీఐ తెలిపారు.

మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో నాయకులు అప్రమత్తంగా ఉండాలనీ, టార్గెట్ లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సీఐ సూచించారు. పాఠశాల విద్యార్థులు గంజాయికి అలవాటు పడుతున్న వైనాన్ని విలేకరులు ఆయన దృష్టికి తీసుకురాగా వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

#vishaka
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe