యాపిల్ ఐఫోన్ 16 వర్సెస్ గూగుల్ పిక్సెల్ 9!

యాపిల్, గూగుల్ తమ ఫ్లాగ్షిప్ స్మార్ట్​ఫోన్ ఐఫోన్ 16 సిరీస్, పిక్సెల్ 9 సిరీస్లను ఇంకా లాంచ్ చేయలేదు. పిక్సెల్ 9 డివైజ్​లు మరికొద్ది రోజుల్లో లాంచ్ కానుండగా, ఐఫోన్ 16 కోసం ఇంకా నెల రోజులు ఆగాల్సిందే. అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్ ఫీచర్ల వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.

యాపిల్ ఐఫోన్ 16 వర్సెస్ గూగుల్ పిక్సెల్ 9!
New Update

లీకులు, రూమర్స్​ ప్రకారం,ఐఫోన్ 16 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.1 ఇంచ్​ సూపర్ రెటీనా ఎక్స్డిఆర్ డిస్ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు పిక్సెల్ 9 స్మార్ట్​ఫోన్​లో హెచ్డీఆర్ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6.3 ఇంచ్​ ఓఎల్ఈడీ డిస్​ప్లే ఉండనుంది. యాపిల్ ఐఫోన్​కు సిరామిక్ షీల్డ్, గూగుల్ పిక్సెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్​తో వచ్చే అవకాశం ఉంది.

కెమెరా : ఐఫోన్ 16లో 48 మెగా పిక్సెల్ మెయిన్, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు స్పేషియల్ వీడియో సపోర్ట్​తో డ్యూయెల్ కెమెరా ఉండనుంది. పిక్సల్ 9లో 50 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా ఉండవచ్చు. ఏదేమైనా, రెండు పరికరాలను జాగ్రత్తగా పరీక్షించిన తర్వాత మాత్రమే కెమెరా పనితీరును అంచనా వేయవచ్చు.

పర్ఫార్మెన్స్​: మెరుగైన పనితీరు, ఏఐ ఫీచర్ల కోసం, ఐఫోన్ 16 కొత్త ఏ18 ప్రో చిప్​సెట్​తో వస్తుందని భావిస్తున్నారు. పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ గూగుల్​కి చెందిన ఇన్-హౌస్ టెన్సర్ జీ4 ప్రాసెసర్​తో రావచ్చు. రెండు చిప్​సెట్​లు మెరుగైన జీపీయూ, సీపీయూ, ఎన్​పీయూ పనితీరును అందిస్తాయని భావిస్తున్నారు.

ఐఫోన్ 16 దీర్ఘకాల పనితీరు కోసం అప్​గ్రేడ్ చేసిన 3561 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, గూగుల్ పిక్సెల్ 9 4600 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది.

గమనిక:- పైన పేర్కొన్న స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీకులు- పుకార్లపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఫ్లాగ్​షిప్ మార్కెట్లో ఏ స్మార్ట్​ఫోన్ బెటర్ అనే విషయాన్ని ధృవీకరించడానికి అధికారిక స్మార్ట్​ఫోన్ లాంచ్​ వరకు వేచి చూడాల్సిందే. త్వరలోనే మరింత క్లారిటీ రానుంది.

ఇంకో విషయం! హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్​లో అందుబాటులో ఉంది. టెక్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని వెంటనే ఫాలో అవ్వండి.

#apple-iphone-16-vs-google-pixel-9
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe