Hansika Motwani:రోబోగా మారబోతున్న ఆపిల్ బ్యూటీ

రోబో అనగానే ఎవరికైనా సూపర్ స్టార్ రజనీకాంత్ గుర్తొస్తారు. త్వరలోనే రోబో పేరు చెప్పగానే తను కూడా గుర్తొస్తానని అంటోంది హన్సిక. అవును.. ఈమె కూడా రోబోగా నటించింది. కాకపోతే సినిమాలో కాదు, రోబో పాత్రతో ఓ వెబ్ సిరీస్ చేసింది..

New Update
Hansika Motwani:రోబోగా మారబోతున్న ఆపిల్ బ్యూటీ

Hansika Motwani: రోబో అనగానే ఎవరికైనా సూపర్ స్టార్ రజనీకాంత్ గుర్తొస్తారు. త్వరలోనే రోబో పేరు చెప్పగానే తను కూడా గుర్తొస్తానని అంటోంది హన్సిక. అవును.. ఈమె కూడా రోబోగా నటించింది. కాకపోతే సినిమాలో కాదు, రోబో పాత్రతో ఓ వెబ్ సిరీస్ చేసింది.

హన్సిక మోత్వాని గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో వచ్చిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తమిళనాట స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం కోలీవుడ్ లోనే ఆమె సినిమాలు చేస్తోంది. ఇప్పుడు సినిమాలతో పాటు.. మైత్రీ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. ఈ సినిమాలో ఆమె హ్యూమనాయిడ్ రోబోగా కనిపించనుంది. “ఎ రోబోటిక్ లవ్ స్టోరీ” అనేది దీని క్యాప్షన్.

గతంలో ఒరు కల్ ఒరు కన్నడి అనే సినిమా చేసింది హన్సిక. ఆ మూవీకి రాజేష్ దర్శకుడు. వీళ్లిద్దరూ కలిసి ఇప్పుడీ వెబ్ సిరీస్ చేస్తున్నారు. వీళ్ల కాంబినేషన్ లో రెండో ప్రాజెక్ట్ ఇది. ఓ ప్రముఖ మల్టీప్లెక్స్‌లో పనిచేసే శరవణన్, ఉదయ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వీళ్లలో ఉదయ్ మీరా (హన్సిక)ను ప్రేమిస్తాడు. ఆమె కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఊహించని విధంగా మీరాకు ఓ బిజినెస్ మేన్ తో పెళ్లి సెట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. మీరా ఎలా రోబోగా మారింది అనేది ఈ కామెడీ రొమాంటిక్ డ్రామా కథ.

అయితే ఇది ఫ్రెష్ ఐడియా కాదంటున్నారు నెటిజన్లు. కొరియాలో ఆల్రెడీ ఇలాంటిది ఒకటి ఉందంటున్నారు. ఐయామ్ నాట్ ఏ రోబోట్ అనే కొరియన్ సిరీస్ నుంచి స్ఫూర్తిపొంది, హన్సికతో వెబ్ సిరీస్ తీసి ఉంటారని అనుమానిస్తున్నారు. త్వరలోనే డిస్నీ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. దీంతో తన కెరీర్ మరింత ముందుకు సాగుతుందని భావిస్తోంది హన్సిక.

Advertisment
తాజా కథనాలు