Heavy Rains: భారీ వర్షాలు.. ఏపీ వ్యాప్తంగా స్కూళ్లకు సెలవు!

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు.అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోందని ఏపీ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

New Update
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన..మరో నాలుగు రోజులు!

Heavy Rains: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి, తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయిన ఏపీ ప్రజలకు కాస్త ఊరట లభించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు.

అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోందని ఏపీ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశముందని అధికారులు వివరించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలుండడంతో మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విజయవాడలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

Advertisment
తాజా కథనాలు