Chandrababu Case Updates: ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్.. టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ టెన్షన్

ఈ రోజు సాయంత్రం 5 గంటలతో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియనుంది. చంద్రబాబు రిమాండ్ గడువు సైతం నేటితో ముగియనుంది. సీఐడీ కస్టడీ ముగిసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆన్ లైన్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు చంద్రబాబును హాజరుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Chandrababu Arrest: 'బరువెక్కిన గుండెతో రాస్తున్న'.. తెలుగు ప్రజానికానికి నారా లోకేష్ లేఖ..
New Update

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియనుంది. చంద్రబాబు రిమాండ్ గడువు సైతం నేటితో ముగియనుంది. సీఐడీ కస్టడీ ముగిసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆన్ లైన్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు చంద్రబాబును హాజరుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రమే చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పై ఏసీబీ జడ్జి నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే.. స్కిల్ డవలప్మెంట్ కేసులో మరో పిటిషన్ దాఖలు చేసేందుకు ఏపీ సీఐడీ సిద్ధం అవుతోంది. చంద్రబాబు కస్టడీని మరో రెండు రోజులు పొడిగించాలని సీఐడీ కోరనున్నట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబుతో జడ్జి మాట్లాడనున్నారు. చంద్రబాబు రిమాండ్ ను జడ్జి మరికొన్ని రోజులు పొడిగిస్తారా? మళ్లీ కస్టడీకి కోర్టు అనుమతిస్తారా? అన్న అంశం ఉత్కంఠగా మారింది. కోర్టు నిర్ణయం కోసం టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు నారా లోకేష్ ఢిల్లీ నుంచి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన చంద్రబాబు విచారణ ఇంకా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు చంద్రబాబుకు లంచ్ బ్రేక్ ఇచ్చారు సీఐడీ అధికారులు. లంచ్ తర్వాత 2 గంటలకు మళ్లీ విచారణ ప్రారంభమైంది. సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు చెప్పిన సమాధానాలను అధికారులు రికార్డు చేస్తున్నారు. అయితే.. చంద్రబాబు చెబుతున్న సమాధానాలతో సీఐడీ టీం సంతృప్తి చెందడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కస్టడీ పొడిగించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేసేందుకు సీఐడీ అధికారులు సిద్ధం అవుతున్నారు.

Read This:
TDP New Committee: టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ.. బాలకృష్ణ, లోకేష్ తో పాటు మరో 12 మందికి చోటు.. లిస్ట్ ఇదే!

#chandrababu #chandrababu-arrest
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe