Anee Master : పాపం.. డ్యాన్స్ చేస్తూ జారిపడ్డ ఆనీ మాస్టర్.. వైరల్ అవుతున్న వీడియో!

ఆనీ మాస్టర్ వర్షంలో తడుస్తూ డ్యాన్స్‌ చేేస ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే నీళ్లల్లో జారి కింద పడిపోయింది. దీంతో ఆనీ మాస్టర్ ముఖానికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Anee Master : పాపం.. డ్యాన్స్ చేస్తూ జారిపడ్డ ఆనీ మాస్టర్.. వైరల్ అవుతున్న వీడియో!

Anee Master Dance Video : టాలీవుడ్ లేడీ కొరియాగ్రాఫర్ ఆనీ మాస్టర్ గురించి తెలిసిందే. స్టార్ హీరోలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె బుల్లితెర డ్యాన్స్ షో ఢీకి సుమారు రెండు సీజన్స్ వరకు జడ్జిగా వ్యవగారించారు.

ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 లో పార్టిసిపేట్ చేసి మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె అప్పుడప్పుడు తన అసిస్టెంట్స్ తో కలిసి రీల్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకి సంబంధించిన ఓ రీల్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Also Read : యూట్యూబ్ ను షేక్ చేసిన ‘పుష్ప పుష్ప’ సాంగ్.. ఏకంగా అన్ని మిలియన్ల వ్యూస్?

డ్యాన్స్ చేస్తూ జారిపడ్డ ఆనీ మాస్టర్

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఆనీ మాస్టర్ వర్షంలో తడుస్తూ డ్యాన్స్‌ చేేస ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే నీళ్లల్లో జారి కింద పడిపోయింది. వర్షంలో వెరైటీగా రీల్‌ చేేసందుకు ప్రయత్నించిన ఆమె పట్టు తప్పి కింద పడిపోవడంతో ఆనీ మాస్టర్ ముఖానికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

ఆ వీడియో చూసి ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇదే వీడియోపై పలువురు నేటిజన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఆనీ మాస్టర్ ని ట్రోల్ చేస్తున్నారు. వర్షం లో డ్యాన్స్ చేయడం అవసరమా? అని కొందరు కింద నీళ్లు ఉన్నప్పుడు జారుతుందని తెలిసి డ్యాన్స్ చేయడం ఎందుకు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు