Aishwarya Rai Bachchan: నీలి కళ్ళ సోయగం, వన్నే తరగని సౌందర్యం ఐశ్వర్య సొంతం

ప్రపంచం మెచ్చిన సౌందర్య దేవత. ఆమె అందం ఓ అద్భుతం. నీలి రంగు కళ్ళతో ఆమె అందరినీ మెస్మరైజ్ చేసే ఐశ్వర్య రాయ్ స్థానం సినీ జగత్తులో ఎప్పుడూ ప్రత్యేకమైనదే.అందానికి అర్థంగా కనిపించే ఐశ్వర్యరాయ్ పుట్టినరోజు నేడు.

New Update
Aishwarya Rai Bachchan: నీలి కళ్ళ సోయగం, వన్నే తరగని సౌందర్యం ఐశ్వర్య సొంతం

Aishwarya Rai Bachchan Birthday: ఆమె అందాన్ని చూస్తే మనసులేని రోబోలు సైతం ఫిదా కావాల్సిందే. అందానికి అభినయం తోడైతే..వచ్చే రూపు పేరే ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai). తన అందంతో.. నటనతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిన నటి. మోడల్‌గా కెరియర్ ను ప్రారంభించి.. మిస్ వరల్డ్‌గా (Miss World) ఎంపికైంది. తర్వాత భారతీయ వెండితెరపై వెలుగులు నింపింది. ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆమె అందానికి కోట్లాది అభిమానులున్నారు.

ఐశ్వర్య రాయ్ 1973 నవంబర్ 1 తేదీన పుట్టింది. ఐశ్వర్య రాయ్ కర్ణాటకలోని మంగళూరులో తుళు భాష మాట్లాడే బంట్ కుటుంబానికి చెందినవారు. ఐశ్వర్య రాయ్ తండ్రి కృష్ణ రాజ్ ఆర్మీలో పని చేశారు. ఆమె తల్లి బృంద. ఐశ్వర్య రాయ్ అన్నయ్య ఆదిత్య రాయ్. 1991లో ఫోర్డ్ సంస్థ నిర్వహించిన "అంతర్జాతీయ సూపర్ మోడల్ కాంటెస్ట్" లో ఐశ్వర్య మొదటి స్థానంలో నిలిచారు. 1993లో నటుడు ఆమిర్ ఖాన్, నటి మహిమా చౌదరిలతో కలసి ఆమె నటించిన పెప్సీ యాడ్ పెద్ద హిట్ అయింది. "హాయ్ అయాం సంజన" అని ఆమె చెప్పే ఒక్క డైలాగ్ చాలా ఫేమస్ అయింది. 1994 మిస్ ఇండియా పోటీల్లో సుస్మితా సేన్ మొదటి స్థానంలో నిలిచారు. ఐశ్వర్య రెండో స్థానం సంపాదించుకున్నారు. అదే ఏడాది మరో పోటీ ఐశ్వర్య జీవితాన్నే మార్చేసింది. 1994 లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో ఐశ్వర్య రాయ్ విన్నర్ గా నిలిచారు. మిస్ వరల్డ్‌ టైటిల్ తో పాటు మిస్ క్యాట్ వాక్, మిస్ మిరాకులస్, మిస్ ఫోటోజెనిక్, మిస్ పర్ఫెక్ట్ టెన్, మిస్ పాపులర్ టైటిళ్ళు కూడా గెలుచుకున్నారు. ఇక సౌత్ ఆఫ్రికాలోని సన్ సిటీలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఐశ్వర్య రెండో స్థానం గెలుచుకున్నారు. ఆ పోటీల్లో మిస్ ఫోటోజెనిక్, మిస్ వరల్డ్ కాంటినెంటల్ క్వీన్ ఆఫ్ బ్యూటీ-ఆసియా అండ్ ఒషెనియా టైటిళ్ళను గెలుచుకున్నారు.

1997లో తమిళ చిత్రం ఇరువర్ తో ఐశ్వర్య సినీ రంగంలోకి అడుగుపెట్టారు. పొలిటికల్ నేపథ్యంతో తెరకెక్కిన "ఇరువర్" తెలుగులో "ఇద్దరు" పేరుతో రిలీజ్ అయింది. తర్వాత హర్ ప్యార్ హో గయా సినిమాతో బాలీవుడ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. 1998లో రిలీజ్ అయిన తమిళ సినిమా జీన్స్ ఐశ్వర్య రాయ్ కెరీయర్ లో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. కర్నాటకలోని మంగళూరులో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈరోజు తన 50వ పుట్టిన రోజున జరుపుకుంటోంది. 1999లో దర్శకుడు సంజయ్ లీలీ బన్సాలీ తెరకెక్కించిన "హమ్ దిల్ దే చుకే సనమ్" చిత్రం ఐశ్వర్య రాయ్ కు మంచి బ్రేక్ తెచ్చి పెట్టింది. అజయ్ దేవగణ్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాలో నటించిన ఐశ్వర్య ఉత్తమ నటిగా "ఫిలిమ్ ఫేర్" అవార్డును అందుకున్నారు.

50 ఏళ్ళ ఐశ్వర్య ఇప్పటికీ వన్నె తరగని అందంతో వెండితెరను ఏలుతున్నారు. హిందీ, తమిళం, తెలుగు, ఇంగ్లీషుల్లో కలిపి ఆమె ఇప్పటికి 40 సినిమాల్లో నటించారు. ఐశ్వర్య కెరీర్లో తన అందం, సినిమాలతో ఎంత పేరు తెచ్చుకుందో కాంట్రవర్శీలతో కూడా అంతే పేరు తెచ్చుకుంది. 2007లో అభిషేక్ బచ్చన్‌ను విమాహం చేసుకున్న ఐశ్వర్య అంతకు ముందు ఇద్దరితో ప్రేమ వ్యవహారం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది.


బాలీవుడ్లోకి అడుగుపెట్టిన కొత్తల్లోనే వివేక్ ఒబెరాయ్ తో ప్రేమ వ్యవహారం నడిపింది ఐశ్వర్యారాయ్. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేశారు. అక్కడి నుంచి మొదలైన వారి ప్రేమ కొన్నాళ్ళ తర్వాత చాలా తొందరగానే ముగిసింది. కారనాలు మాత్రం ఎవరికీ తెలియలేదు. దీని తరువాత సల్మాన్ తో ఐశ్వర్య ప్రేమ మాత్రం చాలా ఫేమస్ అయింది. వీరిద్దరి మధ్యా లవ్ చాలా రోజులే నడిచింది. ఈ సంట పెళ్ళి చేసుకుంటారని కూడా అనుకున్నారు. సల్మాన్ ఐశ్వర్యతో ఒక ఇంటివాడు అవడం ఖాయం అన్నారు. కానీ ఉన్నట్టుండి ఒకరోజు ఐశ్వర్య అతనితో నావల్ల కాదంటూ విడిపోయింది. ఆ టార్చర్‌ను నేను భరించలేను అని చెప్పి మరీ విడిపోయింది. తమ రిలేషన్‌లో సల్మాన్ తనని చాలాసార్లు కొట్టాడని కూడా చెప్పింది ఐశ్వర్య.

2007లో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) తో ఐశ్వర్య వివాహం చాలా ఘనంగా జరిగింది. అప్పటి నుంచి బచ్చన్స్ ఇంటి కోడలిగా ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఈ మధ్యన వీరిద్దరూ విడిపోతారని వార్తలు వచ్చినా అవి నిజం కాదని కొట్టిపారేశారు. అభిషేక్-ఐశ్వర్యలకు ఆరాధ్య అనే అమ్మాయి ఉంది. ఇక తాజాగా ఐశ్వర్య నటించిన సినిమా పొన్నియన్ సెల్వన్. రెండు పార్ట్‌లుగా విడుదలైన ఈసినమాలో ఆమె తన అందంతోనే కాకుండా నటనతో కూడా అదందరినీ ఆకట్టుకుంది.

Advertisment
తాజా కథనాలు