Young Scientist: యువ శాస్త్రవేత్తను మింగేసిన ఆకేరు వాగు!

మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగును దాటే క్రమంలో కారు గల్లంతు కావడంతో.. యువ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని సహా ఆమె తండ్రి గల్లంతయ్యారు. వారి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి.

New Update
Young Scientist: యువ శాస్త్రవేత్తను మింగేసిన ఆకేరు వాగు!

Young Scientist: భారీ వర్షాల కారణంగా తెలంగాణలో చాలా వాగులు, వంకలు పొంగుతున్నాయి. చెరువులు అలుగుపారుతుండగా...మున్నేరు లాంటి నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువ శాస్త్రవేత్త సైతం వరదల్లో కొట్టుకుని పోయి ప్రాణాలు కోల్పోయారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... సింగరేణి మండలంలోని గంగారం తండాకు చెందిన డాక్టర్ నునావత్ అశ్విని వ్యవసాయ శాస్త్రవేత్త. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఐసీఏఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ మేనేజ్‌మెంట్ లో జరగనున్న సదస్సులో పాల్గొనడానికి ఆమెకు ఆహ్వానం అందింది.

దీంతో ఆమె శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి రాయ్‌పూర్ వెళ్లాలని అనుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆమె తండ్రి సునావత్ మోతీలాల్‌తో కలిసి ఆమె కార్‌ లో విమానాశ్రయానికి బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న కారు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమయ్యగూడెం చేరాక.. ఆకేరు వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. అయినప్పటికీ వారు వాగును దాటేందుకు ప్రయత్నించగా...ఆ వరద ఉధృతికి కారు గల్లంతు అయ్యింది. దీంతో కార్లో ప్రయాణిస్తున్న డాక్టర్ అశ్విని ప్రాణాలు కోల్పోయారు. గాలింపు చర్యల్లో అశ్వినితో పాటు ఆమె తండ్రి మృతదేహం కూడా లభ్యమైంది.

Also Read: చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం.. బోటులో వెళ్తుండగా..

Advertisment
తాజా కథనాలు