Tirupati: చిల్లరతో లక్షల బండి... నువ్వు మాములోడివి కాదు బాసూ..!

స్కూటీ కొనేందుకు వెళ్లిన ఓ అర్చకుడు షోరూం యాజమాన్యానికి షాక్ ఇచ్చాడు. అక్షరాల లక్ష ముప్పై వేల చిల్లర నాణెలు సంచుల్లో తీసుకెళ్లిన మురళీధర ఆచార్యులు వాళ్ల ముందు రాశులుగా పోశాడు. ఒక్కసారిగా కంగుతిన్న ఎంప్లాయిస్ చివరికి ఓపికగా లెక్కించి.. కేక్ కట్ చేయించి మరీ బండి చేతికిచ్చారు.

Tirupati: చిల్లరతో లక్షల బండి... నువ్వు మాములోడివి కాదు బాసూ..!
New Update

Tirupati: చిత్తూరు జిల్లా పలమనేరు లోని టీవీఎస్ మోటార్ బైక్ షోరూంలో ఓ వింతైన ఘటన చోటుచేసుకుంది. స్కూటీ కొనేందుకు వెళ్లిన ఓ అర్చకుడు షోరూం యాజమాన్యానికి షాక్ ఇచ్చాడు. అక్షరాల లక్ష ముప్పై వేల చిల్లర నాణెలు సంచుల్లో తీసుకెళ్లిన మురళీధర ఆచార్యులు వాళ్ల ముందు రాశులుగా పోశాడు. ఒక్కసారిగా కంగుతిన్న ఎంప్లాయిస్ చివరికి ఓపికగా లెక్కించి.. కేక్ కట్ చేయించి మరీ బండి చేతికిచ్చారు.

Also Read: అనంతలో ఆందోళన.. రోడ్డెక్కిన శ్రీరామ వాటర్ ప్రాజెక్ట్ వర్కర్లు..!

అసలేం జరిగిందంటే.. పలమనేరులో టీవీఎస్ మోటార్ బైక్ షోరూంకు సంచుల కొద్ది చిల్లర నాణ్యాలతో షోరూమ్ కు వెళ్లాడు బైరెడ్డిపల్లికి చెందిన అర్చకుడు. వీఎస్ జూపిటర్ స్కూటర్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డాడు. అర్చకుడి పేరుపై బిల్లు రూ. లక్ష 30 వేలు చెల్లించాలని షో రూం సిబ్బంది కోరారు. అయితే, లెక్కపెట్టుకొండంటూ సంచులు కొద్ది చిల్లర నాణ్యాలు వారి ముందు రాశులుగా పోశాడు పురోహితుడు. అంత మొత్తంలో చిల్లర నాణ్యాలు చూసి షోరూం యజమాని ఒక్కసారిగా అవాక్కైయ్యారు. ఇంకా చేసేదేమీ లేక ఓపికగా చిల్లర లెక్కింపుకు సిద్ధపడ్డారు షోరూం సిబ్బంది. చిల్లర లెక్కింపుకి దాదాపు మూడు గంటల పాటు సమయం పట్టింది.

Also Read: కోడికత్తి శ్రీనుని ఎంతకాలం జైల్లో ఉంచుతారు?: మాజీ ఎంపీ హర్షకుమార్

షో రూం యాజమాని మొదట చిరాకు పడ్డ.. తరువాత ఈ వింతైన అనుభవంతో చివరికి చిరునవ్వులు చిందించారు. బైరెడ్డిపల్లి మండలం కుప్పనపల్లె కాలభైరవ స్వామి ఆలయంలో అర్చకులుగా ఉన్న మొగళీధర ఆచార్యులు.. మూడు సంవత్సరాలుగా భక్తుల కానుకలను ఇలా కూడ పెట్టినట్లు తెలుస్తోంది. చివరికి మురళీధర ఉష దంపతులచే కేక్ కట్ చేయించి స్కూటర్ ను అప్పజెప్పారు షోరూం యజమాని.

#tirupati
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe