వైద్య ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక ఘట్టం... కాలేయ వ్యాధి హెపటైటిస్ ఎకు వ్యాక్సిన్ కనుగొన్న హైదరాబాద్ సంస్థ

కాలేయ వ్యాధి హెపటైటిస్ ఎ కు వ్యాక్సిన్ కనుగొన్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ..కాలేయ వ్యాధికి ‘హవీస్యూర్-ఆర్’అనే వ్యాక్సిన్ ను జనవరి 19 శుక్రవారం జరిగిన లాంచ్ ఈవెంట్ లో ఆవిష్కరించారు.

వైద్య ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక ఘట్టం...  కాలేయ వ్యాధి హెపటైటిస్ ఎకు వ్యాక్సిన్ కనుగొన్న హైదరాబాద్ సంస్థ
New Update

Hepatitis A Vaccine: వైధ్య రంగంలో  చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయింది. కాలేయ వ్యాధి హెపటైటిస్ ఎకు వ్యాక్సిన్ కనుగొన్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ. కాలేయ వ్యాధికి సంభందించి ‘హవీస్యూర్-ఆర్’ (Havisure®)అనే వ్యాక్సిన్ ను ఆవిష్కరించింది.  చిన్నారులు, కాలేయ వ్యాధితో బాధపడుతున్నవారు ఈ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని జనవరి 19 శుక్రవారం జరిగిన లాంచ్ ఈవెంట్ లో వెల్లడించారు.

హెపటైటిస్ ఎ కు ‘హవీస్యూర్’ వ్యాక్సిన్‌

మన శరీరంలోని  చాలా కేలకమైన ఆర్గాన్ అయిన  కాలేయంకు  ఉన్న ప్రాధాన్యతే వేరు.  మన శరీరానికి హాని కలిగించే విషపదార్ధాలనుంచి మనకు రక్షణ కల్పిస్తూ 500 రకాల విధులను నిర్వహించే ఈ కాలేయానికి ముప్పు వాటిల్లితే ఎంతటి ప్రమాదమో ఊహించుకోండి. ఇలాంటి మేజర్ ఆర్గాన్ కాలేయానికి  ‘హెపటైటిస్‌’ వ్యాధి సవాల్ విసిరితే ..దాన్ని చాలెంజ్ గా తీసుకుని హెపటైటిస్ ఎ కు ‘హవీస్యూర్’ (Havisure®) వ్యాక్సిన్‌ను తయారుచేసింది. ఈ సంస్థ శుక్రవారం (జనవరి 19) హైదరాబాద్‌లోని హయత్ ప్లేస్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ టీకాను లాంచ్ చేశారు. భారతదేశం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోన వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం జరిగిందని నిపుణుల బృందం తెలిపారు. టీం కృషితో విస్తృతమైన పరిశోధన, అనంతరం ఈ వ్యాక్సిన్ Havisure® ను ప్రజల ముందుకు తీసుకొచ్చారని చెప్పారు.

హెపటైటిస్ ఎ ఎలా వ్యాపిస్తుంది?  

హెపటైటిస్ ఎ చాలా ప్రమాదకారి. ఎ మాత్రం అపరిశుబ్రంగా ఉన్న సరే ,, ఈ వ్యాధి సోకే అవకశాలు ఎక్కువ. ముఖ్యంగా కలుషితమైన డ్రింకింగ్ వాటర్ , పాడయిపోయిన ఆహారం కారణంగా  ఈ వ్యాధి సోకుతుంది,ఇలాంటి ప్రమాదకర వైరస్ ను కాలేయానికి సోకకుండా  నివారించడంలో  హెపటైటిస్ ఎ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని  తెలిపారు

రెండు డోసుల టీకా
ఈ వ్యాక్సిన్ రెండు-డోసులు తీసుకోవాల్సి ఉంటుందని ఈ లాంచ్ ఈవెంట్ లో  తెలిపారు. ఏడాది వయసు పూర్తయిన చిన్నారులకు మొదటి డోసు.. మొదటి డోసు తీసుకున్న 6 నెలల తర్వాత రెండో డోసు వ్యాక్సిన్  ఇవ్వాలని తెలిపారు. కాలేయ సంబంధిత రుగ్మతలతో బాధపడేవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్నని  చెప్పారు.

డిమాండ్‌కు అనుగుణంగా ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తి
హెపటైటిస్ A గురించి అవగాహన కలిగించే సెమినార్లు , కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వ సంస్థలతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్దమని ఈ కార్యక్రమంలో తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి తమ సంస్థ  సిద్ధంగా ఉందని ఐఐఎల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రియబ్రత పట్నాయక్ తెలిపారు. అయితే మనదేశం ఇంతవరకు ఈ కాలేయ వ్యాధికి వ్యాక్శిన్ ను విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక.. ఎలాంటి వ్యాక్సిన్ కోసం విదేశాలపై  ఆధారపడాల్సిన అవసరం లేదని , హైదరాబాద్‌లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యాక్సిన్ గురించి కీలక వివరాలు వెల్లడించారు.

ALSO READ: 28 ఏళ్ల తరువాత విశ్వ సుందరి పోటీలకు ఆతిధ్యం ఇవ్వనున్న భారత్

#kcr-health-updates #hepatitis-a #havisure #nddb #iil
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe