కోడలు దాష్టీకం..మామను సజీవంగా తగలబెట్టేందుకు యత్నం.!

మామను సజీవంగా తగలబెట్టేందుకు ప్రయత్నించింది ఓ కోడలు. బెడ్ పై నిద్రిస్తున్న వృద్ధుడి పైకి కాలుతున్న పేపర్ ను విసిరేసింది. వెంటనే అప్రమత్తమైన ఆమె భర్త మంటలు ఆదుపుచేశాడు. భార్య నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

New Update
కోడలు దాష్టీకం..మామను సజీవంగా తగలబెట్టేందుకు యత్నం.!

A daughter-in-law tried to burn her uncle alive:  మామను సజీవంగా తగలబెట్టేందుకు ప్రయత్నించింది ఓ ఇంటి కోడలు. బెడ్ పై నిద్రిస్తున్న తన మామ( వృద్ధుడి) పైకి కాలుతున్న పేపర్ ను విసిరి పారేసింది. వెంటనే అప్రమత్తమైన ఆమె భర్త మంటలు ఆదుపుచేశాడు. భార్య నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్  చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన  నెటిజన్లు ఆ ఇంటి కోడలు తీరుపై తెగ మండిపడుతున్నారు.

Also Read: నగ్నంగా రోడ్లపై తిరుగుతూ యువకుడు హల్ చల్.. పోలీసులపైనే ఎదురు దాడి..!(వీడియో)

బెడ్ పై నిద్రిస్తున్న ఓ వృద్ధుడిపైకి కాలుతున్న పేపర్ ను విసిరేసిందో మహిళ.. బెడ్ పైన బట్టలకు మంటలు అంటుకుని ఆ వృద్ధుడు చనిపోవాలనే ఉద్దేశంతో ఈ పని చేసిందని ఆమె భర్త ఆరోపిస్తున్నాడు. భార్య నిర్వాకాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తెగ విమర్శలు చేస్తున్నారు. మంచానికి పరిమితమైన వృద్ధుడిపై ఈ దాష్టీకం ఏంటని ఫైర్ అవుతున్నారు.

Also Read: రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్‌ మేకర్‌ మృతి..ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రజలు!

వీడియోలోని వివరాల ఆధారంగా.. సదరు మహిళ ఆ వృద్ధుడి కోడలు అని తెలుస్తోంది. ఏం జరిగిందో ఏమో కానీ మామ గదికి నిప్పంటించి చంపేయాలని కోడలు ప్రయత్నించింది. ఓ పేపర్ కు నిప్పంటించి, కాలుతున్న ఆ పేపర్ ను మామ బెడ్ పై పడేసింది. బట్టలకు నిప్పంటుకుని మంటలు ఎగసిపడితే అందులో పడి మామ చనిపోతాడనే ఉద్దేశంతో చేసినట్లుంది. అప్పటికే జరుగుతున్న గొడవను ఫోన్ లో రికార్డు చేస్తున్న ఆమె భర్త వెంటనే స్పందించాడు. బెడ్ కు మంటలు అంటుకోకుండా పేపర్ ను కిందకు తోసేశాడు. తన తండ్రిని చంపేయాలని తన భార్య ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.  ఈ హడావిడికి నిద్రలో నుంచి మేల్కొన్న వృద్ధుడు.. తన బెడ్ పై మంటలు చూసి షాక్ కు లోనయ్యాడు. అయితే, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు.

Advertisment
తాజా కథనాలు