లిఫ్ట్ లో ఇరుక్కొని బాలుడు మృతి..పిల్లలతో బీ అలర్ట్!!

హైదరాబాద్ ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. నూతన భవనంలో లిఫ్ట్ లో ఇరుక్కొని అక్షయ్ కుమార్(4) అనే బాలుడు మృతి చెందాడు. అయితే, కొడుకు మృతదేహాన్ని చూపించకుండా పోలీసులు, బిల్డింగ్ ఓనర్స్ పోస్ట్ మార్టంకు తరలించడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

లిఫ్ట్ లో ఇరుక్కొని బాలుడు మృతి..పిల్లలతో  బీ అలర్ట్!!
New Update

Hyderabad: చిన్న పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, తెలిసి తెలియని వయసులో అల్లరి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా, ఓ నాలుగేళ్ల బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కొని మృతి చెందాడు. అయితే, ఆ బాలుడి డెడ్ బాడీని కనీసం తల్లిదండ్రులకు చూపించకుండా పోస్ట్ మార్టంకు తరలించారు పోలీసులు, బిల్డింగ్ ఓనర్స్. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కొడుకుని కనీసం చివరి చూపు చూసుకోనివ్వకుండా చేశారంటూ మండిపడుతున్నారు. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

Also Read: ఓటర్ల జాబితాలో మహిళ స్థానంలో సీఎం జగన్ ఫోటో.! అసలేం అయిందంటే?

ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నూతన భవనంలో లిఫ్ట్‌లో ఇరుక్కొని అక్షయ్ కుమార్(4) అనే బాలుడు మృతి చెందాడు. గత 20 రోజులుగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నాగరాజు, అనురాధల కొడుకు అక్షయ్. అయితే, ఆ భవనంలో లిఫ్ట్ సరిగ్గా పనిచేయకపోవడంతో బాలుడు అందులో ఇరుక్కుపోయాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అయితే, ఈ విషయాన్ని పోలీసులు, బిల్డింగ్ ఓనర్స్ గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. అందుకోసం మృతి చెందిన బాలుడిని కనీసం బాధిత తల్లి దండ్రులకు చూపించకుండా పోస్ట్ మార్టంకు తరలించారు. దీంతో ఆ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ కొడుకుని తమకు చూపించకుండా పోలీసులు, బిల్డింగ్ ఓనర్స్ పోస్ట్ మార్టంకు ఎలా తరలిస్తారంటూ మండిపడుతున్నారు. కొడుకు డెడ్ బాడీని కనీసం చివరి చూపు చేసేందుకు నోచుకోకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు  చెప్పకుండా సెక్టర్ ఎస్సై గోప్యంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

#hyderabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe